Redmi 13 5G Launch : రెడ్‌మి 13 5జీ ఫోన్ భారత్‌కు వచ్చేస్తోంది.. ఈ నెల 9నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi 13 5G Launch : రెడ్‌మి 13 5జీ గత వెర్షన్ల కన్నా బాక్సీ డిజైన్‌ను కలిగి ఉండనుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ పింక్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో రానుంది.

Redmi 13 5G Launch : ప్రముఖ షావోమీ ఇండియా బడ్జెట్ ఫ్రెండ్లీ రెడ్‌మి 13 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. జూలై 9న అధికారిక లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు కంపెనీ ధృవీకరించింది. రెడ్‌మి 13 5జీ ఫోన్ ఆగస్ట్‌లో లాంచ్ అయిన గతేడాది రెడ్‌మి 12 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్‌‌గా రాబోతోంది.

Read Also : ITR Filing Made Easy : ఐటీఆర్ ఫైలింగ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ తెలుసా? ఇ-ఫైలింగ్ కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరమంటే?

అమెజాన్ ఇండియాలో ఇటీవలి జాబితాతో స్మార్ట్‌ఫోన్ డిజైన్, చిప్‌సెట్, బ్యాటరీ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలను పొందవచ్చు. రెడ్‌మి 13 5జీ గత వెర్షన్ల కన్నా బాక్సీ డిజైన్‌ను కలిగి ఉండనుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ పింక్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో రానుంది. అమెజాన్ లిస్టింగ్ ‘క్రిస్టల్ గ్లాస్ డిజైన్’లో ఉండనుంది. బడ్జెట్-ఫ్రెండ్లీ అయినప్పటికీ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

డిస్‌ప్లే గురించి నిర్దిష్ట వివరాలు వెల్లడించనప్పటికీ, రెడ్‌మి 13 5జీ ఫోన్ ధర విభాగంలో అతిపెద్ద డిస్‌ప్లేలలో ఒకటిగా ఉంటుంది. పంచ్-హోల్ నాచ్ డిజైన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. రెడ్‌మి 12 5జీ ఫోన్ 6.79-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. కొత్త మోడల్‌లో ఇలాంటి లేదా కొంచెం పెద్ద డిస్‌ప్లే ఉంటుంది. రెడ్‌మి 13 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. రెడ్‌‌మి 12 5జీలో అదే చిప్‌సెట్ ఉపయోగించింది.

లాంచ్ ఈవెంట్లో ధర వివరాలు వెల్లడించే ఛాన్స్ :
గత వెర్షన్ ఎంఐయూఐ 14లో పనిచేస్తున్నప్పటికీ, కొత్త మోడల్ షావోమీ లేటెస్ట్ హైపర్ఓఎస్ ద్వారా మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో బలమైన 5,030mAh బ్యాటరీని అందిస్తుంది. రెడ్‌‌మి 13 5జీ ఫోన్ రూ. 10,999 నుంచి లాంచ్ అయిన రెడ్‌మి 12 5జీ మాదిరిగానే రూ. 15వేల లోపు ధరను కలిగి ఉంటుందని అంచనా. జూలై 9 మధ్యాహ్నం 12 గంటలకు జరిగే లాంచ్ ఈవెంట్‌లో కచ్చితమైన ధర వెల్లడి కానుంది.

రెడ్‌మి 13 5జీ పూర్తి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. రెడ్‌మి 12 5జీ స్పెసిఫికేషన్‌ల మాదిరిగా అందిస్తుంది. రెడ్‌మి 12 5జీ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ధర పరిధిలో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. లెఫ్ట్ టాప్ సైడ్ కెమెరా డెకోను కలిగి ఉంది. లెన్స్‌ల చుట్టూ సిల్వర్ మెటాలిక్ రిమ్‌లు ఉన్నాయి. బరువు 198.5 గ్రాములు ఉన్నాయి. రెడ్‌మి 12 5జీ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్‌లో పంచ్-హోల్ నాచ్ డిజైన్, మూడు వైపులా స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. భారత్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్‌ను అందిస్తుంది. రెడ్‌మి 12 5జీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. రెడ్‌మి 13 5జీ ఫోన్ ఈ చిప్‌సెట్‌ను అందిస్తుంది. ప్రాసెసింగ్ పవర్ కూడా అందిస్తుంది. రెడ్‌మి 12 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీ టైప్-సి యూఎస్‌బీ పోర్ట్ ద్వారా 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ కొత్త మోడల్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందిస్తుంది.

Read Also : Vivo Y03t Launch : వివో నుంచి సరికొత్త Y03t ఫోన్, స్మార్ట్‌‌వాచ్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు