Koo Shutting Down : ఎల్లో బర్డ్ గుడ్‌బై.. స్వదేశీ ‘ట్విట్టర్’ కూ మూతపడింది.. అసలు కారణాలివే..!

Koo Shutting Down : కోట్లాది మంది యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగిన కూ ప్లాట్‌ఫాం అప్పట్లో ట్విట్టర్ కు గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం కూ ప్లాట్ ఫారం రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 21 లక్షలకు చేరింది. నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కోటికి చేరుకుంది.

Koo Shutting Down : ట్విటర్‌కు (X)కు పోటీగా వచ్చిన భారతీయ స్టార్టప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం కూ (Koo) మూతపడింది. భారత స్థానిక ప్రత్యామ్నాయంగా భావించిన కూ మూతపడిన విషయాన్ని ఆ కంపెనీ బుధవారం అధికారికంగా నివేదించింది. ఇప్పుడు లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ ద్వారా కంపెనీ సహ వ్యవస్థాపకులు ధృవీకరించారు.

Read Also : iPhone 14 Plus : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై అదిరే ఆఫర్లు.. రూ. 55వేల లోపు ధరకే సొంతం చేసుకోండి!

మయాంక్ బిదవత్కా, సహ వ్యవస్థాపకుడు, కూ భాగస్వామ్యానికి సంబంధించిన చర్చలు విఫలమైన తర్వాత కంపెనీ మూసివేత నిర్ణయాన్ని ప్రకటించారు. మల్టీ లార్జర్ ఇంటర్నెట్ కంపెనీలు, మీడియా సంస్థలతో కూడా కూ కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారిన ప్రాధాన్యతల కారణంగా కూ మూసివేతకు దారితీసిందని ఆయన తెలిపారు. ప్లాట్‌ఫారమ్ నిర్వహణకు నిధులు అవసరమని, నిధుల వృద్ధికి సంబంధించిన ప్రణాళికలను దెబ్బతీస్తుందని మయాంక్ బిదవత్కా అభిప్రాయపడ్డారు.

21 లక్షల యాక్టివ్ యూజర్లతో కూ యాప్ :
కోట్లాది మంది యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగిన కూ ప్లాట్‌ఫాం అప్పట్లో ట్విట్టర్ కు గట్టి పోటీనిచ్చింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు రాజకీయ నేతలు వంటి ఎందరో ప్రముఖులు కూ అకౌంట్లను క్రియేట్ చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం కూ ప్లాట్ ఫారం రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 21 లక్షలకు చేరింది. కంపెనీ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య ఇటీవలే ఒక కోటికి చేరుకుంది.

ఈ ప్లాట్‌ఫారంపై 9 వేల మంది వీఐపీలకు అకౌంట్లు ఉన్నాయి. ఈ దేశీయ సోషల్ ప్లాట్‌ఫారంకు సపోర్టుగా అనేక మంది రాజకీయ నేతలు కూడా క్యాంపెయిన్ చేశారు. అప్పట్లో టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ భారత మార్కెట్లో 23 లక్షల కన్నా ఎక్కువ ట్విట్టర్ అకౌంట్లపై నిషేధం విధించారు. దాంతో అనేక మంది ప్రత్యమ్నాయంగా కూలో అకౌంట్లను తెరిచారు. ఢిల్లీ రైతు ఉద్యమం సమయంలో ఈ యాప్ ఎక్కువగా పాపులర్ అయింది.

మూసివేతకు కారణాలివే :
2019లో ప్రారంభమైన ఈ సోషల్ ప్లాట్‌ఫారమ్ దేశీయ ట్విట్టర్‌గా పేరుగాంచింది. కూ అరంగేట్రం చేసినప్పటి నుంచి గత నాలుగు ఏళ్లుగా అద్భుతంగా ముందుకు సాగింది. ఈ యాప్‌ను బ్రిజిల్, నైజీరియా వంటి దేశాల్లో కూడా భారీగానే విస్తరించింది. యూజర్ బేస్ బాగానే ఉన్పప్పటికీ కంపెనీ ఆర్థికపరమైన సమస్యల్లో చిక్కుకుంది. కంపెనీలో అనేక మంది ఉద్యోగుల తొలగింపులు కూడా జరిగాయి.

ఏప్రిల్ 2023 నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. కూ భాగస్వామ్య చర్చలు ముగిసిన తర్వాత కంపెనీ మూసివేత నిర్ణయాన్ని ప్రకటించింది. ఇతర టెక్ కంపెనీలు, మీడియా సంస్థలతో కూ కంపెనీ చర్చలు జరుపుతోంది. కూ సోషల్ ప్లాట్ ఫారం నిర్వహణకు నిధులు కొరత కారణంగా ప్లాట్‌ఫారం ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కూ మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : Apple iPhone Battery : రాబోయే ఆపిల్ ఐఫోన్లలో సరికొత్త టెక్నాలజీ.. ఇకపై బ్యాటరీ రీప్లేస్‌మెంట్ కూడా చేసుకోవచ్చు..!

 

ట్రెండింగ్ వార్తలు