Raja Singh: పార్టీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ

గోషామహల్ ఎమ్మెల్యే, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ, తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.

Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. వివిధ అంశాల్లో పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినందుకుగాను సస్పెన్షన్ వేటు వేసినట్లు బీజేపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ ప్రకటించింది. పార్టీ నియమావళి రూల్ XXV10 (ఎ) ప్రకారం రాజాసింగ్‌ను సస్పెండ్ చేసినట్లు కేంద్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ సెక్రటరీ ఓం పాతక్ ప్రకటించారు.

Ramyakrishna Latest photoshoot : లేటు వయసులో.. చీరలో రమ్యకృష్ణ ఘాటు ఫోజులు..

దీనిపై తదుపరి విచారణ పెండింగ్‌లో ఉందని, అప్పటివరకు పార్టీ బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో రాజాసింగ్‌ తెలపాలని, ఇందుకోసం పది రోజుల గడువు ఇస్తున్నామని, ఆలోగా సమాధానం చెప్పాలని పార్టీ ఆదేశించింది.

 

ట్రెండింగ్ వార్తలు