చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచకప్‌లో అలాచేసిన తొలి బ్యాట్స్‌మెన్‌ అతనే..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. టీ20, వన్డే ప్రపంచకప్ లో కలిపి వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ గా..

Virat Kohli 3,000 Runs In World Cup : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. టీ20, వన్డే ప్రపంచకప్ లో కలిపి 3వేల పరుగుల మార్క్ ను చేరుకున్న తొలి బ్యాటర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో భాగంగా సూపర్ -8లో శనివారం రాత్రి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను ఐసీసీ నిర్వహించిన ప్రపంచకప్ లో (వన్డే, టీ20) 3వేల పరుగుల మార్క్ ను చేరుకున్నాడు. తద్వారా ప్రపంచ క్రికెట్ చరిత్రలో వరల్డ్ కప్ లలో 3వేల పరుగులు దాటిన తొలి బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

Also Read : Ind Vs Ban : బంగ్లాదేశ్‌పై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సెమీస్‌ బెర్త్ ఖాయం!

విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ లో 32 మ్యాచ్ లు ఆడాడు.. అందులో 30 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. 63.52 సగటు, 129.78 స్ట్రైక్ రేట్ తో 1,207 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 14 అర్థ సెంచరీలు చేశాడు. ఇందులో కోహ్లీ చేసిన అత్యధిక స్కోర్ 89 పరుగులు. అదేవిధంగా వన్డే ప్రపంచకప్ లో కోహ్లీ 37 మ్యాచ్ లు ఆడగా.. 59.83 సగటుతో 1,795 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐదు సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు కోహ్లీ నమోదు చేశాడు. వన్డే ప్రపంచ కప్ లో అతని అత్యధిక స్కోర్ 117 పరుగులు. మొత్తానికి టీ20, వన్డే ప్రపంచకప్ లలో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 3,002 పరుగులు చేశాడు.

Also Read : Gautam Gambhir : టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ మీరేనా..? గౌత‌మ్ గంభీర్ స‌మాధానం ఏంటంటే..?

ఇదిలాఉంటే.. టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ -8లో భారత్ ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లపై విజయం సాధించింది. దీంతో దాదాపు సెమీ ఫైనల్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకుంది. ఈనెల 24న రాత్రి 8గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా జట్టుతో భారత్ సూపర్ -8లో చివరి మ్యాచ్ ఆడనుంది.

 

ట్రెండింగ్ వార్తలు