Ind Vs Ban : బంగ్లాదేశ్‌పై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సెమీస్‌ బెర్త్ ఖాయం!

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్‌ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో హోరాహోరీగా జరిగిన పోరులో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Ind Vs Ban : బంగ్లాదేశ్‌పై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సెమీస్‌ బెర్త్ ఖాయం!

Pic Credit: @BCCI Twitter

Ind Vs Ban : టీ20 ప్రపంచ కప్‌ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో హోరాహోరీగా జరిగిన పోరులో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా విఫలమైంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే బంగ్లాదేశ్ చేతులేత్తేసింది.

భారత్ సెమీస్ బెర్తు ఖరారు అయినట్టే :
టీమిండియ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు క్రీజులో ఎక్కువసేపు తేలిపోయారు. బంగ్లాపై గెలుపుతో భారత్ దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. బంగ్లా ఆటగాళ్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (40) టాప్ స్కోరరుగా నిలవగా, తాంజిద్ హసన్ (29), రిషద్ హోస్సేన్ (24), లిటన్ దాస్ (13), షకీబ్ అల్ హసన్ (11), మహ్మదుల్లా (13) పరుగులతో రాణించారు.

మిగతా ఆటగాళ్లలో మహేదీ హసన్ (5 నాటౌట్), తౌహిద్ హృదయ్ (4), తంజిమ్ హసన్ సాకీబ్ (1), జాకర్ అలీ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా సింగిల్ వికెట్ తీశాడు. పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

బంగ్లాదేశ్ టార్గెట్ 197 పరుగులు :
టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. నార్త్ సౌండ్, ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ముందు టీమిండియా 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మ్యాచులో 11 బంతుల్లో 23 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత షాకిబ్ బౌలింగ్ లో ఓటయ్యాడు.

మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ కూడా 37 పరుగులకు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత  రిషబ్ పంత్ 36, సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులు చేసి వెనుదిరిగారు. శివం దూబె 34, హార్దిక్ పాండ్యా 50 (నాటౌట్), అక్షర్ పటేల్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షాకిబ్, రిషద్ రెండేసి వికెట్లు తీయగా, షాకిబ్ అల్ హాసన్ ఒక వికెట్ తీశాడు.

భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

బంగ్లాదేశ్ జట్టు
తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రెహమాన్

Ravi Shastri : ర‌విశాస్త్రి పోస్ట్ వైర‌ల్‌.. ఇదేం డ్రెస్ రా బాబు అని అంటున్న నెటిజ‌న్లు..