Pawan Kalyan : ఛ.. హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేయాల్సింది.. చేసుంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్..
పవన్ కళ్యాణ్ చాలా సూపర్ హిట్ సినిమా కథలను వదులుకున్న సంగతి తెలిసిందే. (Pawan Kalyan)
Pawan Kalyan
- పవన్ కళ్యాణ్ వదులుకున్న మరో హిట్ సినిమా
- అది కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో
- చేసుంటే బాగుండేది అంటున్న ఫ్యాన్స్
Pawan Kalyan : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రానుంది. ఈ సినిమా మార్చ్ 26 రిలీజ్ కానుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూనే ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
పవన్ కళ్యాణ్ చాలా సూపర్ హిట్ సినిమా కథలను వదులుకున్న సంగతి తెలిసిందే. ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి, పోకిరి.. ఇలా చాలా సూపర్ హిట్ సినిమాలను వద్దనుకున్నారు పవన్. పవన్ వదిలేసిన సినిమాలను రవితేజ అందుకొని స్టార్ హీరో అయ్యాడని కూడా అంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ వదిలేసిన మరో సినిమా గురించి తెలిపాడు.
Also Read : Raviteja : రవితేజ ఏంటి మరీ సన్నగా అయిపోయాడు.. మాస్ మహారాజ కొత్త లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నేను మిరపకాయ్ కథని ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికే చెప్పాను. ఆయన ఓకే అన్నారు. మూడు నెలలు ట్రావెల్ చేసారు ఆ కథతో. కానీ ఎందుకో తర్వాత వద్దన్నారు. మిరపకాయ్ వదిలేసి ఆయన తీన్మార్ సినిమా చేశారు. దాంతో నేను రవితేజతో మిరపకాయ్ సినిమా చేశాను అని తెలిపారు.
మిరపకాయ్ సినిమా 2011లో సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్ కొట్టింది. తీన్మార్ సినిమా అదే 2011 లో సమ్మర్ కి వచ్చి యావరేజ్ గా నిలిచింది. ఆ వెంటనే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి 2012 లో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ మిరపకాయ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ చేసుంటే బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద హిట్స్ పవన్ ఖాతాలో పడేవి అని అనుకుంటున్నారు. అప్పుడు కూడా పవన్ వద్దనుకున్న సినిమా రవితేజ వద్దకు వెళ్లి హిట్ కొట్టడం గమనార్హం.
Also Read : Ayesha Khan : నాపై రేప్ అటెంప్ట్ చేశారు.. షూటింగ్ సెట్ లోనే ఉండి.. అయేషా ఖాన్ సంచలన వ్యాఖ్యలు..
