Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసు.. ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే..
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసు ఇంట్రెస్టింగ్గా మారింది. నవంబర్ 14తో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతుండటంతో.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ నేతలు లాబీయింగ్ స్పీడప్ చేశారట.
Governor Quota MLC Race in Telangana Congress
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసు ఇంట్రెస్టింగ్గా మారింది. నవంబర్ 14తో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతుండటంతో.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ నేతలు లాబీయింగ్ స్పీడప్ చేశారట. మూడు ఎమ్మెల్సీ బెర్తులను సామాజికవర్గాల వారీగా భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చారట ప్రభుత్వ పెద్దలు. ఇప్పటికే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంతో.. గవర్నర్ కోటాలో బీసీలకు పెద్దపీట వేయాలని అనుకుంటున్నారట.
మూడు ఎమ్మెల్సీ స్థానాలకుగాను రెండు బీసీలకు.. ఒకటి ఎస్సీ సామాజికవర్గానికి ఇస్తారని టాక్. అయితే ఇప్పటికే ఒకటి పద్మశాలి సామాజికవర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సిరిసిల్ల సభ వేదికగా హింట్ ఇచ్చారు సీఎం రేవంత్. ఇక రవీంద్రభారతిలో జరిగిన పండుగ సాయన్న జన్మదిన వేడుకల సందర్భంగా.. రెండో ఎమ్మెల్సీ సీటుపై కీలక కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి. ముదిరాజ్ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ బెర్తు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌ను కోరారు.
పద్మశాలి వర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో ప్రకటించడంతో పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ కూతురు పవిత్ర పేరును పరిశీలిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత ఇద్దరు సీఎం రేవంత్‌కు సన్నిహితులుగా పనిచేస్తున్నారు. ముగ్గురిలో ఎవరికో ఒకరికి బెర్త్ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇదే టైమ్‌లో సీఎం రేవంత్ లేటెస్ట్ కామెంట్స్‌తో కాంగ్రెస్‌లోని ముదిరాజ్ సామాజికవర్గం నేతలు అలర్ట్ అయ్యారు.
రేసులో అందరి కంటే ముందు వరుసలో నీలం మధు ముదిరాజ్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. నీలం మధు ముదిరాజ్ సామాజికవర్గంలో మంచి పట్టున్న నేత కావడంతో.. సీఎం రేవంత్ కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు.. నీలం మధుకు ఎమ్మెల్సీ ఇవ్వాలనే ప్రపోజల్ నడించిందట. ఇప్పుడు ముదిరాజ్ కోటాలో భాగంగా నీలం మధు పేరు మరోసారి చర్చకు వస్తోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా నీలం మధు విషయంలో సానుకూలంగా ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్ అంటున్నారు.
కాంగ్రెస్‌లో ఉన్న మిగతా ముదిరాజ్ నేతలు కూడా మండలి బెర్త్ కోసం ఉవ్విల్లూరుతున్నారట. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సునీతారావు పార్టీకి చేసిన సేవలు.. కష్టకాలంలో పనిచేసిన తీరును గుర్తించాలని కోరుతున్నారట. ఆమె ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి తన పేరును పరిశీలించాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తాండూరుకు చెందిన రమేష్ ముదిరాజ్, మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి.
మూడు ఎమ్మెల్సీ బెర్తులను మూడు సామాజిక వర్గాలకు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తుండటంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే పద్మశాలి సామాజికవర్గానికి ఒక సీటు ప్రకటించడంతో.. లేటెస్ట్గా సీఎం ఇచ్చిన హింట్‌తో ముదిరాజ్ సామాజికవర్గం నేతల్లోనూ ఆశలు పెరిగిపోయాయి. మూడో ఎమ్మెల్సీ సీటు ఎస్సీకి కేటాయిస్తే.. ఎవరిని అదృష్టం వరించబోతుందో చూడాలి మరి.
