Mumbai Indians : ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. జయవర్ధనే స్థానంలో కొత్త హెడ్‌కోచ్‌గా విధ్వంసకర ఆల్‌రౌండర్
Mumbai Indians : ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. మహేళ జయవర్ధనే స్థానంలో కొత్త హెడ్ కోచ్ ను నియమించింది.
Mumbai Indians
Mumbai Indians : ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు తమ కొత్త హెడ్ కోచ్‌ను ప్రకటించింది. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్, జట్టు మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన పొలార్డ్.. ఇకపై ప్రధాన కోచ్‌గా జట్టును నడిపించనున్నారు. గత కోచ్ మహేళ జయవర్ధనే తన బాధ్యతల నుంచి తప్పుకున్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడటం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముంబై ఇండియన్స్‌తో పొలార్డ్‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆటగాడిగా జట్టులో ఎన్నో విజయాల్లో భాగమైన ఆయన.. ఆ తర్వాత కోచింగ్ బృందంలోనూ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇప్పుడు హెడ్ కోచ్‌గా ప్రమోషన్ లభించడంతో జట్టు ప్రదర్శనను మెరుగుపరచడం, ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం వంటి బాధ్యతలు ఆయనపై ఉండనున్నాయి.
శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా రెండు విడతల్లో పనిచేశారు. ఆయన కోచింగ్‌లో ముంబై జట్టు 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. అయితే గత రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. 2026 ఐపీఎల్‌లోనూ జట్టు నిరాశాజనక ప్రదర్శనతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో జయవర్ధనే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ గెలుచుకున్నప్పటికీ.. 2020 తర్వాత ఆ జట్టు మరోసారి ట్రోఫీని అందుకోలేకపోయింది. దీంతో రాబోయే సీజన్లో తిరిగి విజయాల బాట పట్టాలనే లక్ష్యంతో జట్టు యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముంబై జట్టు ఆటగాళ్ల సామర్థ్యాలపై మంచి అవగాహన ఉన్న పొలార్డ్ హెడ్ కోచ్‌గా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.
Mumbai Indians elevate Kieron Pollard as Head Coach
A defining figure in MI’s success, the remarkable 16-year association of Kieron Pollard within the #OneFamily enters a new chapter.
Read more – https://t.co/ORZz4gruIr https://t.co/BMI38BYH1f
— Mumbai Indians (@mipaltan) October 24, 2026
