Raviteja : రవితేజ ఏంటి మరీ సన్నగా అయిపోయాడు.. మాస్ మహారాజ కొత్త లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..
రవితేజ రీసెంట్ లుక్స్ వైరల్ గా మారాయి. (Raviteja)
Raviteja
సన్నబడిన రవితేజ
మాస్ మహారాజ కొత్త లుక్స్ వైరల్
ఆ సినిమా కోసమేనా
Raviteja : మాస్ మహారాజ రవితేజ ఇటీవల ఎప్పుడో అడపాదడపా హిట్స్ కొడుతున్నాడు కానీ వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే సినిమా చేస్తున్నాడు.
రవితేజ రీసెంట్ లుక్స్ వైరల్ గా మారాయి. నిన్న రాత్రి జరిగిన విజయ్ – రష్మిక రిసెప్షన్ కి రవితేజ హాజరయ్యాడు. ఈ ఈవెంట్ నుంచి రవితేజ ఫొటోలు, వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రవితేజ చాలా సన్నగా అయిపోయాడు. ఎప్పుడూ ఉండేదానికన్నా రవితేజ బాగా సన్నపడిపోవడంతో ఏంటి ఇలా అయిపోయాడు అని ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Ayesha Khan : నాపై రేప్ అటెంప్ట్ చేశారు.. షూటింగ్ సెట్ లోనే ఉండి.. అయేషా ఖాన్ సంచలన వ్యాఖ్యలు..
ఈ రిసెప్షన్ నుంచే కాక ఇటీవల ఇరుముడి సెట్ నుంచి లీక్ అయిన ఫోటోలలో కూడా రవితేజ చాలా సన్నగానే కనిపించాడు. దీంతో నిజంగానే ఇరుముడి సినిమా కోసమే అని అనుకుంటున్నారు. అయితే ఇటీవల భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రమోషన్స్ లో కూడా రవితేజ బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఇరుముడి సినిమా కోసమే ఇలా సన్నబడ్డాడా? లేదా ఇంకేదైనా కారణం ఉందా అని సందేహిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

రవితేజ సన్నబడినా ఈ లుక్ బాగుందంటున్నారు. ఒకవేళ ఇరుముడి సినిమా కోసమే అయితే ఆ సినిమాలో రవితేజని కొత్త మేకోవర్ లో చూడొచ్చని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఇరుముడి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో రవితేజ అయ్యప్పమాలలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని కార్తీక మాసంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Virosh Reception : విజయ్ – రష్మిక రిసెప్షన్.. సందడి చేసిన రాజకీయ నేతలు, ప్రముఖులు.. ఫొటోలు
