T20 World Cup 2026 : ఔట్ అంటావా మామ..? కాదంటావా? మార్క్రమ్ ఔట్ పై దుమారం.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో (T20 World Cup 2026) దక్షిణాప్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఔట్‌కు సంబంధించి దుమారం రేగుతోంది.
T20 World Cup 2026 SA vs NZ Is Daryl Mitchell takes clean catch of Aiden Markram
- కివీస్, దక్షిణాఫ్రికా మధ్య సెమీస్ మ్యాచ్
- ఐడెన్ మార్క్రమ్ ఔట్ పై వివాదం
- ఔటా? నాటౌటా?
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 నుంచి దక్షిణాఫ్రికా నిష్ర్కమించింది. బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. కాగా.. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సౌతాఫ్రికా సెమీస్ కు చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈమ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఔటైన తీరుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
మార్క్రమ్ ఇచ్చిన క్యాచ్‌ను కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్ లాంగాన్‌లో అందుకున్నాడు. అయితే.. రిప్లేలో బంతి నేలను తాకినట్లుగా కనిపించినప్పటికి కూడా థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం దుమారాన్ని రేపుతోంది.
Shikhar Dhawan : హోలీ పండుగ.. కొత్త భార్యతో శిఖర్ ధావన్.. మామూలుగా లేదుగా..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ను కివీస్ బౌలర్ రచిన్ రవీంద్ర వేశాడు. ఈ ఓవర్లోని నాలుగో బంతిని మార్క్రమ్ భారీ షాట్ ఆడాడు. బంతి లాంగాన్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డారిల్ మిచెల్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అతడు క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలను తాకినట్లుగా అనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సాయం కోరాడు.
BIG MOMENT!
A superb catch from Daryl Mitchell in the deep draws curtains for Aiden Markram ☝️#T20WorldCup broadcast details ➡️ https://t.co/NPykWM7qqY pic.twitter.com/2ww42zDeVf
— ICC (@ICC) March 4, 2026
ఇక రిప్లేలో కూడా డారిల్ మిచెల్ వేళ్ల మధ్య నుంచి బంతి నేలను తాకినట్లు కనిపించింది. దీంతో మార్క్రమ్ నాటౌట్ అని అంతా భావించారు. అయితే.. అనూహ్యంగా థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించడంతో అటు మార్క్రమ్తో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, అభిమానులు షాక్‌కు గురి అయ్యారు. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ బంతి కింద చేతి వేళ్లు ఉన్నాయని భావించడంతోనే ఔట్ ఇచ్చాడు. ఆ సమయానికి మార్క్రమ్ 20 బంతుల్లో 18 పరుగులు చేసి క్రీజులో సెట్ అయి ఉన్నాడు.
కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు అది ఔట్ అని అంటుంటే మరికొందరు మాత్రం నాటౌట్ అని అంటున్నారు.
