Gautam Gambhir : టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ మీరేనా..? గౌత‌మ్ గంభీర్ స‌మాధానం ఏంటంటే..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగియ‌నుంది.

Gautam Gambhir : టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ మీరేనా..? గౌత‌మ్ గంభీర్ స‌మాధానం ఏంటంటే..?

Gautam Gambhir Finally Breaks Silence On India Coach Job

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో బీసీసీఐ చేప‌ట్టిన కొత్త కోచ్‌ ఎంపిక ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్‌తో పాటు మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు కోచ్‌గా ప‌ని చేసిన రామ‌న్ ల‌ను వ‌ర్చువ‌ల్‌గా క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ ఇంట‌ర్వ్యూలు చేసింది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ రాబోతున్నారే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదే విష‌య‌మై గౌత‌మ్ గంభీర్‌కు ప్ర‌శ్నఎదురైంది. అయితే.. ఇప్పుడే ఏం చెప్ప‌లేన‌ని గంభీర్ అన్నాడు. కోల్‌కతాలో శుక్రవారం ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో గౌతీ పాల్గొన్నాడు. ఈ క్ర‌మంలో గంభీర్ మాట్లాడుతూ.. ఇప్పుడే అంత దూరం ఆలోచించ‌డం లేద‌న్నాడు. మీరు త‌న‌ను క‌ఠిన‌మైన ప్ర‌శ్నలు అడుగుతున్నార‌ని, ఇప్పుడే దీని(కోచ్ ప‌ద‌వి) పై స‌మాధానం చెప్ప‌డం చాలా క‌ష్ట‌మ‌న్నాడు.

USA vs WI : అమెరికా ఇంటికి.. వెస్టిండీస్ ఆశ‌లు స‌జీవం..

ప్ర‌స్తుతం ఇక్క‌డ ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు. ఇదో అద్భుత ప్ర‌యాణం అని, దానిని ఆస్వాదిద్దామ‌ని తెలిపాడు. ఆట‌గాళ్ల కంటే కూడా జ‌ట్టుకు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం త‌న వ్య‌క్తిత్వం అని చెప్పాడు. వ్య‌క్తుల కంటే కూడా జ‌ట్టును ముందు ఉంచాల‌నే ఆలోచ‌న‌తో ఉంటే ఈ రోజు కాక‌పోయినా కూడా రేపు స‌రైన ఫలితాలు అందుకుంటార‌ని పేర్కొన్నాడు. ‘అన్నింటి క‌న్నా జ‌ట్టు ముందు అనేది నా సిద్ధాంతం. జ‌ట్టులోని 11 మంది ప్లేయ‌ర్ల‌న ఒకేలా చూడాల‌ని, అంద‌రికీ స‌మానంగా గౌర‌వం, బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని, అప్పుడే విజ‌యాల‌ను అందుకోగం. అని గంభీర్ అన్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించిన గౌత‌మ్ గంభీర్ కేకేఆర్ టైటిల్ అందుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. గ‌తంలో కేకేఆర్ జ‌ట్టు అత‌డి నాయ‌క‌త్వంలో రెండు సార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు (2007 టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌)లు గెలుచుకున్న భార‌త జ‌ట్టులో గౌతీ స‌భ్యుడు. ఈ రెండు ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచుల్లో టీమ్ఇండియా టాప్ స్కోర‌ర్ గౌత‌మ్ గంభీరే కావ‌డం విశేషం.

Sania Mirza : ష‌మీతో సానియా మీర్జా పెళ్లి..? మౌనం వీడిన టెన్నిస్ స్టార్ తండ్రి

కాగా.. మెంటార్‌గా కేకేఆర్‌ను ఐపీఎల్ విజేత‌గా నిల‌ప‌డంతో గౌత‌మ్ గంభీర్‌ టీమ్ఇండియా ప్ర‌ధాన కోచ్‌గా రావ‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో రెండు లేదా మూడు రోజుల్లో కొత్త కోచ్ పేరును బీసీసీఐ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.