Sania Mirza : షమీతో సానియా మీర్జా పెళ్లి..? మౌనం వీడిన టెన్నిస్ స్టార్ తండ్రి
మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Sania Mirza Marrying Mohammed Shami Tennis Star Father Breaks Silence On Rumours
Sania Mirza – Mohammed Shami : మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు మహమ్మద్ షమీ కొంతకాలంగా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు షమీ గానీ, ఇటు సానియా గానీ స్పందించలేదు. దీంతో వీరి పెళ్లి వార్తలు నిజమేనన్న రూమర్లు మొదలయ్యాయి.
ఎట్టకేలకు ఈ వార్తలపై సానియా మీర్జా తండ్రిని ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. అవన్నీ చెత్త వార్తలు అని, ఇందులో ఎంత మాత్రం నిజం లేదన్నాడు. అసలు సానియా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా షమీని కలిసింది లేదన్నాడు. ఇలాంటి రూమర్లను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డాడు.
ఇదిలా ఉంటే.. షోయబ్ నుంచి విడిపోయిన తరువాత సానియా తన కుమారుడు ఇజాన్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. కాగా.. ఇటీవల సానియా హజ్ యాత్రకు వెలుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన షమీ చీలమండలానికి గాయమైన సంగతి తెలిసిందే. దీనికి శస్త్ర చికిత్స చేయించుకున్న అతడు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
Pat Cummins : టీ20 ప్రపంచకప్2024లో తొలి హ్యాట్రిక్.. బంగ్లాదేశ్ పై పాట్ కమిన్స్ ఘనత..