AP IAS Officers : ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు..

AP IAS Officers : ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 26 జిల్లాలకుగానూ 13 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని 7 జిల్లాల కలెక్టర్‌లకు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

AP IAS Officers : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర పాలనపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక జిల్లాల్లో పోస్టింగులు పొందిన అధికారులకు స్థానచలనం కలిగింది. ఏపీ వ్యాప్తంగా భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

మొత్తం 26 జిల్లాలకుగానూ 13 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని 7 జిల్లాల కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీతో అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు కలెక్టర్లకు జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

  • గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్. నాగలక్ష్మిని నియామకం
  • ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • అల్లూరు జిల్లా కలెక్టర్‌గా దినేశ్ కుమార్ నియామకం
  • అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత బదిలీ
  • కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలిషణ్మోహన్
  • జె. నివాస్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి నియామకం
  • ప్రసన్న వెంకటేశ్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం
  • కె.మాధవిలతను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బీఆర్ అంబేద్కర్ నియామకం
  • పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నాగరాణి నియామకం
  • చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్ కుమార్ నియామకం
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన నియామకం
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు బదిలీ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జీడీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
  • ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా అమీన్ అన్సారియా నియామకం
  • కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా నియామకం
  • తదుపరి ఆదేశాలు వచ్చేవరకు బాపట్ల కలెక్టర్‌గా జేసీకి అదనపు బాధ్యతలు

Read Also : GST Council Meet : చిరు వ్యాపారుల కోసం జీఎస్టీ కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు : నిర్మలా సీతారామన్

ట్రెండింగ్ వార్తలు