TRS Vs Governor for letter issue : గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది .. అపాయింట్‌మెంట్ ఇస్తే అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం : మంత్రి సబిత

TRS Govt Vs Governer for letter issue : విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఉమ్మడి నియామకాల బోర్డు ఏర్పాటు బిల్లుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై నుంచి తనకు ఎలాంటి లేఖ రాలేదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. కానీ ఈరోజు మంత్రి సబిత మాట్లాడుతూ..గవర్నర్ నుంచి తమ ప్రభుత్వానికి లేఖ వచ్చిందని..గవర్నర్ ను కలవాలని ప్రభుత్వం తనను ఆదేశించింది అని గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్ ఇస్తే తప్పకుండా కలిసి ఆమెకున్న అన్ని సందేహాలు నివృత్తి చేస్తామని మంత్రి సబిత వెల్లడించారు. అపాయింట్ మెంట్ ఇస్తే గవర్నర్ ను కలిసి లేఖపై అన్ని సందేహాలు క్లియర్ చేస్తామని తెలిపారు.

ఈ విషయంపై మాడమ్ కు అన్ని విషయాలు నివృత్తి చేశామని దాని కోసం అపాయింట్ మెంట్ అడిగామని రాగానే స్వయంగా కలిసి అన్ని విషయాలు క్షుణ్ణంగా వివరిస్తామని తెలిపారు. కానీ తాము అపాయింట్ మెంట్ ఇంకా ఖరారు కాలేదని ఇస్తే తప్పకుండా స్వయంగా వెళ్లి కలిసి అన్నివిషయాలు వివరంగా చెబుతామని తెలిపారు. న్యాయపరమైన అన్ని అంశాలు గవర్నర్ కు వివరిస్తానని వెల్లడించారు మంత్రి సబిత.

తెలంగాణలో ప్రభుత్వానికి..రాజభవన్ కు మధ్య వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ కావాలనే ఆమోదం తెలుపకుండా పెండింగ్ లో పెడుతున్నారంటూ ఆరోపిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు గురించి ప్రభుత్వానికి లేఖ రాశామని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. దీనిపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. రాజ్ భవన్ నుంచి తనకు ఎలాంటి లేఖ అందలేదని స్పష్టం చేశారు.

TRS Govt – Raj Bhavan : గవర్నర్ నుంచి ఎలాంటి లేఖ అందలేదన్న మంత్రి సబిత .. సమాచారం ఇచ్చామని స్పష్టంచేసిన రాజ్ భవన్ వర్గాలు

విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఉమ్మడి నియామకాల బోర్డు ఏర్పాటు బిల్లుకు సంబంధించి అటు గవర్నర్ కు ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగింది.గవర్నర్ నుంచి తమకు అస్సలు ఎటువంటి లేఖ రాలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపింది. స్వయంగా విద్యాశాఖా మంత్రి సబిత కూడా అదే చెప్పారు. దీంతో రాజ్ భవన్ వర్గాలు మంత్రి సబిత వ్యాఖ్యలపై స్పందించాయి. మెసెంజెర్ ద్వారా సమాచారం అందించామని స్పష్టంచేశాయి.

ఈ వివాదం ఇలాగే కొనసాగుతుండా..గవర్నర్ ఈరోజు (నవంబర్ 9,2022) ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడనున్నారు. ఈక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. గవర్నర్ నుంచి తమకు లేఖ అందింది అని..గవర్నర్ అపాయింట్ కోరామని..ఇస్తే ఈ లేఖపై గవర్నర్ కు ఉన్న సందేహాలన్ని తీరుస్తామని వెల్లడించటం విశేషం.


										

ట్రెండింగ్ వార్తలు