iVoomi JeetX ZE : పవర్‌ఫుల్ ఫీచర్లతో ఐవూమీ జీట్ఎక్స్ జేఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. 170కి.మీ రేంజ్.. ధర ఎంతంటే?

iVoomi JeetX ZE electric scooter : ఐవూమీ జీట్‌ఎక్స్ జేఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 80వేలు ఉంటుంది. 3kWh బ్యాటరీతో 170 కి.మీ వేగం వరకు అందుకోగలదు.

iVoomi JeetX ZE electric scooter launch ( Image Credit : Google )

iVoomi JeetX ZE electric scooter : ప్రముఖ పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఐవూమీ తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. జీట్‌ఎక్స్ జెడ్ఈ లైనప్ విస్తరించింది. ఈ కొత్త ఈవీ స్కూటర్ ధర రూ. 80వేలు ఎక్స్-షోరూమ్ ఉంటుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 170 కిమీల పరిధితో వస్తుంది. మరో 3 వేరియంట్లలో రానుంది. ఈవీ నార్డో గ్రే, ఉత్రా రెడ్, అర్బన్ గ్రీన్ వంటి వాటితో 8 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : Motorola Razr 50 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్.. రెజర్ 50 అల్ట్రా ధర, స్పెసిఫికేషన్‌లు లీక్!

జీట్‌ఎక్స్ జేఈ 57కి.మీ టాప్ స్పీడ్ :
జీట్‌ఎక్స్ జేఈ 2.1కిలోవాట్ పీక్ పవర్ బీఎల్‌డీసీ మోటారుతో 3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ కాంబోలో ఈవీ స్కూటర్ గంటకు 57కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. నగర వీధుల్లో రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5.5 గంటలు సమయం పడుతుంది. అయితే 50 శాతం బ్యాటరీ ఛార్జ్ 2.5 గంటలలోపు పూర్తి అవుతుంది. 7ఎ హోమ్ వాల్ సపోర్టుతో ఛార్జర్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీ ఐదేళ్లు లేదా 50వేల కిమీల వారంటీతో వస్తుంది.

ముందువైపు 75ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు 60ఎమ్ఎమ్ స్ప్రింగ్ లోడ్ యూనిట్ కలిగి ఉంది. వీల్‌పై డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ యూనిట్ నుంచి స్టాపింగ్ పవర్ వస్తుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ, జియో-ఫెన్సింగ్ ఉన్నాయి. డిస్టెన్స్-టు-ఎంప్టీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఎస్ఎంఎస్ కాల్ అలర్ట్‌లతో బ్లూటూత్ కనెక్టివిటీకి ఇన్ఫోగ్రాఫిక్స్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా పొందుతుంది.

Read Also : iPhone 16 Pro Display : ఆపిల్ ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ 16 ప్రోలో 20శాతం బ్రైట్‌నెస్ డిస్‌ప్లే.. కొత్త క్యాప్చర్ బటన్..!

ట్రెండింగ్ వార్తలు