Dgp Ravi Gupta : 73వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు- ఎన్నికల ఏర్పాట్లపై డీజీపీ రవి గుప్త

500 తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాలు సహా 164 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు.

Dgp Ravi Gupta On Election Arrangements (Photo Credit : Google)

Dgp Ravi Gupta : తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి డీజీపీ రవి గుప్త వివరాలు వెల్లడించారు. పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిందని, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీసు విభాగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.

ఎన్నికల ఏర్పాట్లపై డీజీపీ రవి గుప్త..
”500 తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాలు సహా 164 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు. తమిళనాడుకు చెందిన 3 స్పెషల్‌ ఆర్మ్‌డ్ కంపెనీలు వచ్చాయి. 7వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు నిర్వహణ. 482 ఫిక్స్‌డ్‌ స్టాటిక్‌ టీమ్‌లు, 462 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌లు, 89 ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ చెక్‌పోస్టులు, 173 అంతర్‌జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు. ఇప్పటివరకు రూ.186 కోట్ల విలువ చేసే మద్యం, డ్రగ్స్‌ స్వాధీనం. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు. 34వేల 526మంది రౌడీషీటర్లు బైండోవర్”.

* ఏపీ, తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం
* ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు
* తెలంగాణలో 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు
* మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు
* తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య – 3 కోట్ల 32లక్షల 32వేల 318 మంది
* తెలంగాణలో పురుష ఓటర్ల సంఖ్య – కోటి 65 లక్షల 28వేల 366
* తెలంగాణలో మహిళా ఓటర్ల సంఖ్య – కోటి 67 లక్షల 1,192
* థర్ జెండర్ ఓటర్ల సంఖ్య – 2,760
* సీనియర్ సిటిజన్స్ – 1,93,754
* తెలంగాణలో 18 నుంచి 19ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య – 9,20,313

Also Read : ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు.. మూతపడ్డ మద్యం దుకాణాలు