నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉంది. అనంతరం ఉత్తర-వాయవ్య దిశగా పయనమవుతుంది.
ఈ నెల 30 నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. చిత్తూరువారు 9491077356, నెల్లూరు వారు 0861–2331261 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.
Gold Rates: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలాగున్నాయో తెలుసా?