Ap Elections 2024 : ఏపీలోని ఆ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్ గడువు

మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకుంటే.. అరకు 51.08 శాతం, పాడేరులో 40.12 శాతం, రంపచోడవరంలో 65.33 శాతం పోలింగ్ నమోదైంది.

Ap Elections 2024 : ఏపీలో మూడు ఏజెన్సీ నియోజకవర్గాల్లో పోలింగ్ గడువు ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ గడువుగా ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో 4 గంటల వరకే పోలింగ్ కు సమయం ఇచ్చారు. ప్రస్తుతం క్యూలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకుంటే.. అరకు 51.08 శాతం, పాడేరులో 40.12 శాతం, రంపచోడవరంలో 65.33 శాతం పోలింగ్ నమోదైంది.

ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కు సమయం ఇచ్చింది ఈసీ. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ గడువు ముగిసింది. ఇక.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు వరకే పోలింగ్ గడువు ఇచ్చింది ఈసీ. ఆ సమయంలోగా క్యూలైన్ లో నిల్చున్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు.

Also Read : వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ను చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

ట్రెండింగ్ వార్తలు