Vivo T3 Ultra Launch : కొత్త వివో టీ3 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు, ధర వివరాలు లీక్!

Vivo T3 Ultra Launch : వివో టీ3 అల్ట్రా సెప్టెంబర్ 12న ప్రకటించింది. లాంచ్‌కు ముందు, ఈ వివో ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

Vivo T3 Ultra India launch date revealed ( Image Source : Google )

Vivo T3 Ultra Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో టీ3 అల్ట్రా ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అనేక లీకుల తర్వాత, కంపెనీ రాబోయే వివో టీ సిరీస్ ఫోన్ అధికారిక లాంచ్ తేదీని వెల్లడించింది.

వివో టీ3 అల్ట్రా సెప్టెంబర్ 12న ప్రకటించింది. లాంచ్‌కు ముందు, ఈ వివో ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : iPhone 17 Series : బిగ్ కెమెరా అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ ఇదిగో..!

వివో టీ3 అల్ట్రా లీక్డ్ భారత్ ధర :
లీక్ వివరాల ప్రకారం.. వివో టీ3 అల్ట్రా ఫోన్ 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు ప్రారంభ ధర రూ. 30,999తో రావచ్చు. 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 32,999, 12జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 34,999కి విక్రయించనుంది. కానీ, వివో టీ3 అల్ట్రా అధికారిక ధరలు కావని గమనించాలి.

వివో టీ3 అల్ట్రా స్పెక్స్, ఫీచర్లు లీక్ :
వివో టీ3 అల్ట్రా ఇటీవల లాంచ్ అయిన ఐక్యూ జెడ్9ఎస్ మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉందని కంపెనీ లాంచ్ చేసిన అధికారిక టీజర్ సూచిస్తుంది. ఇందులో ప్రధాన వ్యత్యాసం రంగు మాత్రమే. టీజర్‌ల ప్రకారం.. కొత్త వివో ఫోన్ గ్రీన్ షేడ్‌లో అందుబాటులో ఉంటుంది.

స్పెషిఫికేషన్ల విషయానికొస్తే..
వివో టీ3 అల్ట్రా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని లీక్‌లు వెల్లడించాయి. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ద్వారా బ్యాకప్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌తో 6.77-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది.

వెనుకవైపు, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ని చూడవచ్చు. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెన్సార్ ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 16ఎంపీ సెన్సార్‌ని చూడవచ్చు. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం డ్యూయల్ స్పీకర్ సెటప్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. మిగిలిన ఫీచర్ల వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.

Read Also : iPhone 15 Pro Max : ఆపిల్ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్.. భారత్‌లో ధర ఎంత తగ్గిందంటే?

ట్రెండింగ్ వార్తలు