Swiggy Privacy Feature : స్విగ్గీలో కొత్త ప్రైవేట్ మోడ్ ఫీచర్.. ఇకపై, సీక్రెట్‌గా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.. ఇదేంటి? ఎలా పనిచేస్తుందంటే?

Swiggy Privately Order Food : స్విగ్గీ కస్టమర్లు ఇకపై బహుమతి లేదా వ్యక్తిగత ట్రీట్ అయినా తమ ఆర్డర్ వివరాలను మాన్యువల్‌గా డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా పూర్తి ప్రైవసీని పొందవచ్చు.

Swiggy privately order food incognito mode ( Image Source : Google )

Swiggy Privacy Feature : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ ఇన్‌కాగ్నిటో (ప్రైవేట్) మోడ్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం.. ఆహారం లేదా కమర్షియల్ ఆర్డర్‌లను చేసేటప్పుడు యూజర్లకుమరింత ప్రైవసీని అందించేలా కొత్త ఫీచర్ రూపొందించింది.

Read Also : Jio Free Swiggy Lite Plan : ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌పై ఫ్రీ స్విగ్గీ లైట్ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఈ కొత్త మొదటి ఫీచర్ వినియోగదారులకు నిర్దిష్ట ఆర్డర్‌లను వారి ఆర్డర్ హిస్టరీలో కనిపించకుండా చేస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతి లేదా వ్యక్తిగత ట్రీట్ అయినా, వినియోగదారులు ఇప్పుడు తమ ఆర్డర్ వివరాలను మాన్యువల్‌గా డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా పూర్తి ప్రైవసీని ఆస్వాదించవచ్చు.

ప్రైవేట్ మోడ్ ఎవరికి బెనిఫిట్ అంటే? :
ప్రైవేట్ మోడ్ వివిధ పరిస్థితులకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో అకౌంట్లను షేర్ చేసేవారికి బెస్ట్ ఆప్షన్. ఉదాహరణకు, ఎవరైనా పుట్టినరోజు కేక్ డెలివరీని ప్లాన్ చేస్తుంటే లేదా వార్షికోత్సవం కోసం ప్రత్యేక బహుమతిని కొనుగోలు చేస్తుంటే.. ఈ ఫీచర్ ఉపయోగించి తమ ఆర్డర్ హిస్టరీ ఇతరులకు కనిపించకుండా చూసుకోవచ్చు.

స్విగ్గీ (Instamart) నుంచి వ్యక్తిగత వెల్నెస్ ప్రొడక్టులను ఆర్డర్ చేయడం వంటి కొనుగోళ్లకు కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా, వినియోగదారులు తమ ఆర్డర్ హిస్టరీ ఇతరులకు కనిపిస్తుందనే భయం లేకుండా ఆర్డర్‌లను ప్రైవేట్‌గా ఉంచవచ్చు.

ప్రస్తుతం, ఈ ఫీచర్ 10 శాతం స్విగ్గీ యూజర్లకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో విస్తృతమైన ప్లాన్ అందిస్తోంది. ప్రైవేట్ మోడ్ నేటి సామాజిక ప్రపంచంలో పెరుగుతున్న ప్రైవసీ అవసరాన్ని పరిష్కరిస్తుంది. వినియోగదారులు తమ ఎంపికలను బహిర్గతం చేయడానికి భయపడకుండా కొనుగోళ్లు చేసేందుకు అనుమతిస్తుందని ఫుడ్ మార్కెట్‌ప్లేస్ స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ పేర్కొన్నారు.

“మీరు భోజనాన్ని ఆర్డర్ చేసినా లేదా త్వరగా కొనుగోలు చేసినా, ప్రైవేట్ మోడ్ మీ ఆప్షన్లను ప్రైవేట్‌గా ఉండేలా చూస్తుంది. మా యూజర్లకు మెరుగైన ప్రైవసీతో స్విగ్గీ విభిన్న ఆఫర్‌లను అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాం” అని స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ అన్నారు.

ఇదేలా పని చేస్తుందంటే? :
స్విగ్గీలో ప్రైవేట్ మోడ్‌ని యాక్టివేట్ చేయడం చాలా సులభం. వినియోగదారులు ఆర్డర్ చేసే ముందు వారి కార్ట్‌లోని సాధారణ టోగుల్ ఆప్షన్ ద్వారా ఎనేబుల్ చేయొచ్చు. ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన తర్వాత ప్రైవేట్ మోడ్ ఆన్‌ రిమైండర్ పాపప్ వస్తుంది. ఆర్డర్ డెలివరీ తర్వాత, డెలివరీ తర్వాత ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే 3 గంటల పాటు కనిపిస్తుంది.

ఈ వ్యవధి తర్వాత యూజర్ ఆర్డర్ హిస్టరీ నుంచి ఆర్డర్ ఆటోమాటిక్‌గా హైడ్ చేస్తుంది. దాంతో పూర్తి ప్రైవసీని అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్ గ్రూప్ ఆర్డరింగ్, ఈట్‌లిస్ట్‌లు, ఎక్స్‌ప్లోర్ మోడ్, రీఆర్డరింగ్, ఇలాంటి కార్ట్‌ల వంటి యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచే లక్ష్యంతో స్విగ్గీ అప్‌డేట్‌లను అందిస్తుంది. ప్రైవేట్ మోడ్‌తో యూజర్లు తమ ప్రైవసీని కాపాడుకుంటూ వారి కొనుగోళ్లపై మరింత కంట్రోల్ కలిగి ఉండేలా స్విగ్గీ భరోసా ఇస్తోంది.

Read Also : WhatsApp Group Call : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. గ్రూపు చాట్‌లో త్వరలో కాల్ లింక్ షార్ట్‌కట్ క్రియేట్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు