Jio Free Swiggy Lite Plan : ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌పై ఫ్రీ స్విగ్గీ లైట్ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Jio Free Swiggy Lite Plan : రిలయన్స్ జియో, స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ భాగస్వామ్యంతో జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు పండుగ సీజన్లో వినోదంతో పాటు ఫుడ్ డెలివరీ అనుభవాన్ని అందిస్తుంది.
Jio Free Swiggy Lite Plan : ప్రముఖ భారతీయ టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను బండిల్ ప్రవేశపెట్టింది. స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు పండుగ సీజన్లో ఫుడ్ డెలివరీ అనుభవాన్ని అందించనుంది. స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జియో-స్విగ్గీ బండిల్ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే :
రోజువారీ 2జీబీ డేటా : డేటా అయిపోతుందని చింతించకుండా వీడియోలను స్ట్రీమ్ చేయడానికి, గేమ్‌లు ఆడటానికి, ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయడానికి తగినంత డేటా పొందవచ్చు.
అన్లిమిటెడ్ వాయిస్ కాల్లు : భారతదేశంలోని ఏదైనా జియో నంబర్‌కు మరియు ఏదైనా ఇతర నెట్వర్క్ నంబర్‌కు అపరిమిత వాయిస్ కాల్లు చేయండి.
అన్లిమిటెడ్ 5జీ డేటా : జియో వెల్కమ్ ఆఫర్‌తో 90 రోజుల పాటు 5జీ డేటా వేగాన్ని పొందవచ్చు.
3 నెలల స్విగ్గీ వన్ లైట్ సబ్స్క్రిప్షన్ ద్వారా రూ. 600 విలువైన బెనిఫిట్స్, కాంప్లిమెంటరీ 3 నెలల స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
మీరు స్విగ్గీ లైట్ (Swiggy Lite) యూజర్‌గా మారిన తర్వాత రూ. 149 కన్నా ఎక్కువ ఫుడ్ ఆర్డర్లపై 10 ఉచిత హోమ్ డెలివరీలను పొందవచ్చు. రూ. 199 కన్నా ఎక్కువ ఉన్న ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లపై 10 ఉచిత హోమ్ డెలివరీలు పొందవచ్చు. ఫుడ్, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లపై ఎలాంటి సర్జ్ ఫీజు లేదు.
దాంతో పాటు, వినియోగదారులు సాధారణ ఆఫర్ల కన్నా 20వేలకు పైగా రెస్టారెంట్లలో 30 శాతం వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. మెంబర్షిప్ ప్లాన్‌లో రూ. 60 కన్నా ఎక్కువ స్విగ్గీ జెనై డెలివరీలపై 10 శాతం తగ్గింపు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో, మీరు డేటా బెనిఫిట్స్ మాత్రమే కాకుండా ఫుడ్ డెలివరీలను కూడా పొందవచ్చు.
జియో ప్లాన్ ధర, లభ్యత :
జియో-స్విగ్గీ బండిల్ ప్లాన్ ధర రూ. 866తో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్ జియో వెబ్సైట్, మైజియో (MyJio) యాప్, భారత్‌లోని రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. జియో-స్విగ్గీ బండిల్ ప్లాన్ అనేది స్ట్రీమింగ్ వీడియోలు, గేమ్‌లు ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం వంటి వాటిని ఆనందించే జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు గొప్ప అవకాశమని చెప్పవచ్చు. ఎంటర్టైన్మెంట్, ఫుడ్ డెలివరీ బెనిఫిట్స్ కలయికను అందించే ఈ ప్లాన్ పండుగ సీజన్లో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
జియో, స్విగ్గి మధ్య భాగస్వామ్యంతో భారతీయ టెలికాం, ఫుడ్ డెలివరీ పరిశ్రమలలో మరింత అభివృద్ధిని సాధించే వీలుంది. జియో-స్విగ్గీ బండిల్ ప్లాన్ కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడంలో రెండు కంపెనీల నిబద్ధతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ బండిల్ ప్లాన్‌తో, జియో ప్రీపెయిడ్ కస్టమర్లు బఫర్-ఫ్రీ ఎంటర్టైన్మెంట్, ప్రత్యేకమైన ఫుడ్ డెలివరీ బెనిఫిట్స్ పొందవచ్చు. పండుగ సీజన్‌ను మరింత ఆనందదాయకంగా మార్చవచ్చు.
Read Also : Apple iMessage App : ‘ఐమెసేజ్’ యాప్ ఆపిల్ డివైజ్‌లకు మాత్రమేనా..? ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా రావచ్చు..!