iPhone 17 Series : బిగ్ కెమెరా అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ ఇదిగో..!

iPhone 17 Series : ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 24ఎంపీ కెమెరాను అందిస్తాయి. నివేదిక ప్రకారం.. ఐఫోన్ 17 లైనప్‌లో ఐఫోన్ 17 మోడల్ ఐఫోన్ 17 స్లిమ్, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్‌లు ఉంటాయి. 

iPhone 17 Series to get big camera upgrade ( Image Source : Google )

iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 సిరీస్ కొన్ని వారాల తర్వాత లాంచ్ కానుంది. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 17 సిరీస్ వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఐఫోన్ 17 సిరీస్‌లోని నాలుగు మోడల్‌లు కెమెరాలో పెద్ద అప్‌గ్రేడ్‌ను అందుకుంటాయని లేటెస్ట్ లీక్ వెల్లడించింది.

Read Also : Pixel 9 Pro Fold Launch : గూగుల్ నుంచి మడతబెట్టే ఫోన్.. పిక్సెల్ 9ప్రో ఫోల్డ్ వచ్చేస్తోంది.. ఫుల్ ఫీచర్లు లీక్..!

ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 24ఎంపీ కెమెరాను అందిస్తాయి. నివేదిక ప్రకారం.. ఐఫోన్ 17 లైనప్‌లో ఐఫోన్ 17 మోడల్ ఐఫోన్ 17 స్లిమ్, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్‌లు ఉంటాయి. ఆరు ప్లాస్టిక్ లెన్స్ ఎలిమెంట్స్‌తో 24ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండనుంది. ఐదు ప్లాస్టిక్ లెన్స్ ఎలిమెంట్స్‌తో 12ఎంపీ ఫ్రంట్ కెమెరాతో అమర్చిన ప్రస్తుత ఐఫోన్ 15 మోడల్‌లతో పోలిస్తే అతి పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో అంచనాలు నిజమయ్యాయి.

గత జనవరిలో, ఐఫోన్ 17 సిరీస్‌లోని కనీసం ఒక మోడల్‌లో సిక్స్-పీస్ లెన్స్‌తో 24ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని కుయో సూచించింది. మల్టీ పాపులర్ నుంచి ఈ రిపోర్టుల కలయికతో ఈ అప్‌గ్రేడ్ అందుకోనుంది. కొత్త 24ఎంపీ రిజల్యూషన్ ఫొటో క్వాలిటీని గణనీయంగా అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ అప్‌గ్రేడ్ యూజర్ల ఫొటోలను కట్ చేసే యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎందుకంటే.. హై రిజల్యూషన్ ఫొటో క్వాలిటీని కోల్పోకుండా పోస్ట్-ప్రాసెసింగ్‌ అందిస్తుంది. ఫలితంగా స్పష్టమైన ఫొటోలను పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 17 మోడల్స్ సెప్టెంబరు 2025లో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. లాంచ్ తేదీ రివీల్ చేయనప్పటికీ, భవిష్యత్ ఐఫోన్ తరాలకు సంబంధించిన వివరాలను రివీల్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఈ ఏడాదిలో సెప్టెంబర్‌లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఆపిల్ త్వరలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ డేట్‌ను రివీల్ చేసే అవకాశం ఉంది.

Read Also : Citroen Basalt : సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీ-కూపే వచ్చేస్తోంది.. పూర్తి వివరాలివే..!

ట్రెండింగ్ వార్తలు