అనంతలో రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎం నుంచి రూ.29లక్షలు చోరీ, గ్యాస్ కట్టర్ సాయంతో..

ఆ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దొంగల కన్ను దానిపై పడింది. ముందుగా రెక్కీ చేసినట్లు తెలుస్తోంది.

Robbery In ATM : అనంతపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంను పగలగొట్టి రూ.29లక్షలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం డోర్లను తొలగించి డబ్బు దోచుకున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఏటీఎంను పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అనంతపురం పట్టణంలోని రామ్ నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఈ చోరీ జరిగింది. అర్థరాత్రి 2గంటల 40 నిమిషాలకు దొంగతనం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎం షట్టర్ ను గ్యాస్ కట్టర్ సాయంతో తొలగించారు. ఆ తర్వాత మెషిన్ డోర్లను కూడా గ్యాస్ కట్టర్ తో తొలగించారు. అందులో ఉన్న దాదాపు 30 లక్షల నగదు దోచుకెళ్లారు. ఏటీఎం అలారం మోగి పోలీసులు స్పాట్ కి వచ్చే లోపు దొంగలు అక్కడి నుంచి నగదుతో పారిపోయారు. చోరీ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.

ఆ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దొంగల కన్ను దానిపై పడింది. ముందుగా రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో ఎవరూ ఉండరని తెలుసుకున్న దొంగలు.. గ్యాస్ కట్టర్ సాయంతో భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ కేసుని పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. కాగా, మెయిన్ రోడ్డులోనే ఈ తరహా దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Also Read : ఏలూరు జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా రూ.40 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం

ట్రెండింగ్ వార్తలు