Honour Killing: పెళ్లైన కొన్ని గంటలకే వరుడిని చంపిన వధువు సోదరులు.. తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య
రాయవరం డిప్యూటీ ఎమ్మార్వోగా పని చేస్తున్న సంధ్య, వేములపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి సూర్యప్రకాష్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
Honour Killing Representative Image (Image Credit To Original Source)
Honour Killing: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పరువు హత్య చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటలకు వరుడిని అతి కిరాతకంగా చంపేశారు వధువు సోదరులు. మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో ఈ దారుణం జరిగింది. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని ఆమె అన్నదమ్ములు తట్టుకోలేకపోయారు. కోపంతో రగిలిపోయారు. చెల్లెలి భర్తపై రాళ్లతో దాడి చేసి చంపేశారు. రాయవరం డిప్యూటీ ఎమ్మార్వోగా పని చేస్తున్న అయినవిల్లి సంధ్య, వేములపల్లికి చెందిన సూర్యప్రకాష్ రావు అనే బట్టల వ్యాపారి ప్రేమించుకున్నారు. అన్నవరంలో వివాహం చేసుకున్నారు.
అయితే, కులాలు వేరు కావడంతో వధువు అన్నదమ్ములకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తమను కాదని సూర్యప్రకాశ్ ను తమ సోదరి పెళ్లి చేసుకోవడాన్ని వారు తట్టుకోలేకపోయారు. కోపంతో రగిలిపోయారు. పెళ్లి అయిన కొన్ని గంటలకే వేములపల్లిలో సూర్యప్రకాష్ రావుపై సంధ్య అన్నదమ్ములు దాడి చేశారు. రాళ్లతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన సూర్యప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పరువు హత్య స్థానికంగా సంచలనం రేపింది. సూర్యప్రకాశ్ మృతితో అతడి ఇంట్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: చిన్నారి ఆద్య సేఫ్.. తప్పిపోయిన 30 నిమిషాల్లోనే కనిపెట్టిన ఇబ్రహీంపట్నం పోలీసులు

Surya Prakash
