Vivo X200 Leak : కొత్త వివో ఎక్స్200 ఫోన్ వివరాలు లీక్.. డమ్మి యూనిట్ డిజైన్.. బ్యాటరీ వివరాలు ఇవే..!

Vivo X200 Leak : వివో ఎక్స్200 డమ్మీ యూనిట్ టిప్‌స్టర్ ఎక్స్‌పీరియన్స్ మోర్ ద్వారా వెయిబో పోస్ట్‌లో షేర్ చేసింది. బ్యాక్ కెమెరా మాడ్యూల్ సిల్వర్ రింగ్ చుట్టూ కేంద్రంగా ఉంచిన వృత్తాకార మాడ్యూల్‌లో కనిపిస్తుంది.

Vivo X200 Leaked Dummy Unit Shows Design ( Image Source : Google )

Vivo X200 Leak : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో నుంచి సరికొత్త ఎక్స్200 సిరీస్ ఫోన్ వస్తోంది.. వివో ఎక్స్100 లైనప్‌కు అప్‌గ్రేడ్‌గా వస్తుందని భావిస్తున్నారు. వివో ఎక్స్100, వివో ఎక్స్100ప్రో ఈ ఏడాది జనవరిలో భారత మార్కెట్లో లాంచ్ అయింది.

Read Also : Pixel 9 Pro Fold Launch : గూగుల్ నుంచి మడతబెట్టే ఫోన్.. పిక్సెల్ 9ప్రో ఫోల్డ్ వచ్చేస్తోంది.. ఫుల్ ఫీచర్లు లీక్..!

వివో ఫోన్‌లు మొదట నవంబర్ 2023లో చైనాలో ఆవిష్కరించగా గత డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. కంపెనీ ఇంకా రాబోయే హ్యాండ్‌సెట్‌లను లేదా వాటి లాంచ్ టైమ్‌లైన్‌ను ధృవీకరించలేదు. అయితే, వివో ఎక్స్200 ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త లీక్ అయిన వివో ఎక్స్200 డమ్మీ యూనిట్ డిజైన్‌ను చూపుతుంది. రాబోయే వివో ఎక్స్200 ప్రో బ్యాటరీ స్పెసిఫికేషన్‌లను టిప్‌స్టర్ రివీల్ చేసింది.

వివో ఎక్స్200 డిజైన్, ఫీచర్లు (అంచనా) :
వివో ఎక్స్200 డమ్మీ యూనిట్ టిప్‌స్టర్ ఎక్స్‌పీరియన్స్ మోర్ ద్వారా వెయిబో పోస్ట్‌లో షేర్ చేసింది. బ్యాక్ కెమెరా మాడ్యూల్ సిల్వర్ రింగ్ చుట్టూ కేంద్రంగా ఉంచిన వృత్తాకార మాడ్యూల్‌లో కనిపిస్తుంది. వివో ఎక్స్200 కూడా స్లిమ్ యూనిఫాం బెజెల్స్‌తో కొద్దిగా వంగిన డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.

ఫ్రంట్ కెమెరా లొకేషన్ ప్యానెల్ పైభాగంలో సెంట్రల్డ్ హోల్-పంచ్ స్లాట్‌లో కనిపిస్తుంది. కింది భాగంలో ఎడ్జ్ మైక్, సిమ్ ట్రే స్లాట్‌తో పాటు స్పీకర్ గ్రిల్, యూఎస్‌‌బీ టైప్-సి పోర్ట్‌ను సూచిస్తుంది. వివో ఎక్స్200 50ఎంపీ కస్టమైజడ్ సోనీ ప్రధాన కెమెరా, 3ఎక్స్ మిడ్ రేంజ్ టెలిఫోటో లెన్స్, 1.5కె డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని మునుపటి లీక్‌లు పేర్కొన్నాయి.

వివో ఎక్స్200 ప్రో బ్యాటరీ, ఇతర ఫీచర్లు (అంచనా) :
మరో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వివో ఎక్స్200ప్రో 6,000mAh కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉండవచ్చని వెయిబో పోస్ట్‌లో పేర్కొంది. భారీ బ్యాటరీ కారణంగా ఫోన్ బరువు, మందం కలిగి ఉంటుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 సిరీస్ హ్యాండ్‌సెట్‌లలో మాదిరిగానే కంపెనీ ఫైబర్‌గ్లాస్ మెటీరియల్‌ను ఉపయోగించవచ్చునని టిప్‌స్టర్ తెలిపారు.

వివో ఎక్స్200 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, పెరిస్కోప్ లెన్స్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో రావచ్చని ఇదే టిప్‌స్టర్ ద్వారా గత లీక్‌లు సూచిస్తున్నాయి. వివో ఫోన్ 6.7 లేదా 6.8-అంగుళాల కర్వడ్ 1.5కె డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Read Also : iPhone 17 Series : బిగ్ కెమెరా అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ ఇదిగో..!

ట్రెండింగ్ వార్తలు