Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై అన్లిమిటెడ్ 4G డేటా, మరెన్నో డేటా బెనిఫిట్స్
Reliance Jio : జియో కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్లను అందిస్తోంది. ఎటువంటి లిమిట్స్ లేకుండా అన్ లిమిటెడ్ 4G డేటాతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.
Reliance Jio
- జియో యూజర్ల కోసం కొత్త పోస్టు పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు
- జియో రూ. 640 ప్లాన్ పై డేటా, కాలింగ్ బెనిఫిట్స్
- జియో రూ. 349 ప్లాన్ తో ఫ్రీగా జియో హాట్‌స్టార్
జియో యూజర్లకు పండగే. రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై అన్ లిమిటెడ్ 4G డేటాను అందిస్తోంది. జియోకు పోటీగా ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కూడా అందిస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా ఎప్పటినుంచో ఈ ప్లాన్ అందిస్తోంది. రిలయన్స్ జియో రూ. 649 ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ 4జీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది. పూర్తి బెనిఫిట్స్ ఎలా పొందాలో చూద్దాం.
రిలయన్స్ జియో రూ. 649 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్ :
Read Also : Apple Devices Sale : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఈ 5 ఆపిల్ డివైజ్‌లపై అదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
- అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్
- రోజుకు 100 SMS
- అన్లిమిటెడ్ 4G డేటా
- 3 నెలలు జియోహాట్‌స్టార్ మొబైల్, టీవీ
- ఫ్రీ 50GB స్టోరేజీతో జియోఏఐ క్లౌడ్
- 18 నెలలు గూగుల్ జెమిని ప్రో ప్లాన్ ధర రూ. 35,100
- అర్హత ఉన్న కస్టమర్లకు అన్ లిమిటెడ్ 5G డేటా
గూగుల్ జెమిని ప్రో ప్లాన్ 18 నెలలు పొందవచ్చు. రూ. 349కు పైగా ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే చాలు. జియో హాట్‌స్టార్ కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ దేశంలోని అన్ని సర్కిల్లో అందుబాటులో ఉంది.
