MacBook Air M4 : కొత్త ల్యాప్‌టాప్ కావాలా..? ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!
MacBook Air M4 : ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
MacBook Air M4
- ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ M4పై ఖతర్నాక్ డిస్కౌంట్
- విజయ్ సేల్స్‌లో ఈ ల్యాప్‌టాప్ రూ. 97,900 మాత్రమే
- బ్యాంకు కార్లు ఆఫర్లతో రూ. 85వేల కన్నా తక్కువ ధరకే
MacBook Air M4 : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. వారం క్రితమే ఆపిల్ M5 చిప్సెట్తో రన్ అయ్యే సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను కంపనీ ప్రవేశపెట్టింది. ఈ ల్యాప్‌టాప్ 2025లో లాంచ్ అయిన M4 మ్యాక్‌బుక్ మాదిరిగానే డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తుంది.
పర్ఫార్మెన్స్ పరంగా కొన్ని అప్గ్రేడ్లతో వచ్చింది. మీరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం చూస్తుంటే పాత మోడల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 మోడల్ కొనేసుకోవచ్చు. ఇప్పుడు ఆపిల్ మ్యాక్‌బుక్ M4 స్పెషల్ డిస్కౌంటుతో లభ్యమవుతుంది. రూ. 7వేల కన్నా ఎక్కువగా నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ధర అదనంగా రూ. 5వేలు తగ్గుతుంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై భారీ డిస్కౌంట్ :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 చిప్‌తో 13 అంగుళాల ధర (16GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్) రూ. 99,900కు లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు, విజయ్ సేల్స్ డీల్‌లో భాగంగా, ల్యాప్‌టాప్ రూ. 97,900తో లభిస్తుంది. అదనంగా, మరో 8శాతం తగ్గింపు ఉంది. తద్వారా ధర రూ. 89,900కి తగ్గుతుంది. ఎలాంటి కూపన్లు, ప్రమోషనల్ కోడ్లు అవసరం లేదు.
మీరు కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో మరింత ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. బ్యాంకు కార్డులతో ధర మరో రూ. 5వేలు తగ్గుతుంది. ఈ మ్యాక్ బుక్ ఎయిర్ M4 ఫైనల్ ధర రూ. 85వేల కన్నా తక్కువకు వస్తుంది. 2026లో లాంగ్ టైమ్ సాఫ్ట్వేర్ సపోర్టు, మంచి పర్ఫార్మెన్స్ అందించే ప్రీమియం ల్యాప్‌టాప్ కోసం చూస్తున్న వారికి ఈ ధరలో అద్భుతమైన ఆప్షన్.
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 మొత్తం 2స్క్రీన్ సైజులలో వస్తుంది. 13 అంగుళాలు, 15 అంగుళాలలో లభ్యమవుతుంది. ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది. ప్రీమియం బిల్ట్ క్వాలిటీతో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 500 నిట్స్ వరకు సపోర్ట్ చేసే లిక్విడ్ రెటినా డిస్ప్లేతో వస్తుంది.
హుడ్ కింద ల్యాప్‌టాప్ ఆపిల్ M4 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. పాత జనరేషన్ మోడల్ అయినా ఇప్పటికీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అప్లియన్సెస్, ఎక్స్ ట్రనల్ డిస్ప్లేలను కనెక్ట్ చేసేందుకు రెండు థండర్‌బోల్ట్ పోర్టులను అందిస్తుంది. ఆపిల్ 12MP సెంటర్ స్టేజ్ కెమెరాతో వస్తుంది. వీడియో కాల్స్ సమయంలో ఫ్రేమ్‌ను ఆటోమాటిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది.
సాఫ్ట్వేర్ విషయానికి వస్తే.. ఈ ల్యాప్‌టాప్ కొత్త సిరి టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. వాయిస్, టెక్స్ట్ రెండింటితో అసిస్టెంట్ ద్వారా వాయిస్ చాట్ చేయొచ్చు. ఆపిల్ సిరి, రైటింగ్ టూల్స్‌లో చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్‌తో ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ 18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
