Oppo A3X 5G Launch : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఒప్పో A3x 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే..!

Oppo A3X 5G Launch : ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 45డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందిస్తుంది. ఈ నెల చివరిలో అమ్మకానికి రానుంది.

Oppo A3X 5G With SuperVOOC Charging Launched ( Image Source : Google )

Oppo A3X 5G Launch : భారత మార్కెట్లోకి ఒప్పో ఎ3ఎక్స్ 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్ 1,000 నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయి, టూటైమ్ రీన్‌ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ స్ప్లాష్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఎమ్ఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 45డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందిస్తుంది. ఈ నెల చివరిలో అమ్మకానికి రానుంది.

Read Also : Flipkart iPhone Days Sale : ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

భారత్‌లో ఒప్పో ఎ3ఎక్స్ 5జీ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఒప్పో ఎ3ఎక్స్ 5జీ ప్రారంభ ధర 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ధర రూ. 12,499గా ఉంటుంది. అయితే, 4జీబీ + 128జీబీ ఆప్షన్ ధర రూ.13,499, ఆగస్టు 7 నుంచి ఒప్పో ఇండియా ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా దేశంలో కొనుగోలుకు స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ మొత్తం స్పార్కిల్ బ్లాక్, స్టార్రీ పర్పుల్, స్టార్‌లైట్ వైట్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఒప్పో ఎ3ఎక్స్ 5జీని కొనుగోలు చేసే కస్టమర్‌లు నెలకు రూ. 2,250 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందండి. ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,350 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఒప్పో ఎ3ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఎ3ఎక్స్ 5జీ 6.67-అంగుళాల హెచ్‌డీ+ (1,604 x 720 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌తో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1,000నిట్స్ గరిష్ట ప్రకాశంతో రీన్‌ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌ని కలిగి ఉంది. స్ప్లాష్ టచ్ టెక్నాలజీకి కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే తడి వేలు తాకినప్పుడు కూడా వేగంగా పనిచేస్తుంది.

ఒప్పో ఎ3ఎక్స్ 5జీ ఏఆర్ఎమ్ మాలి-జీ57 జీపీయూ, 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ 5.1 స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14.0.1తో రన్ అవుతుంది. కెమెరా విభాగంలో ఒప్పో ఎ3ఎక్స్ 5జీ 8ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ షూటర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తుంది.

ఈ ఫోన్ ఐపీ54 రేటింగ్‌ను కూడా అందిస్తుంది. ఒప్పో ఎ3ఎక్స్ 5జీ 45డబ్ల్యూ వైర్డు సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. డ్యూయల్ నానో సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై5, బ్లూటూత్ 5.3, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ సైజు 165.7 x 76.0 x 7.7మిమీ, 187 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Reliance New Store : హయత్‌నగర్‌లో రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్ ప్రారంభం..

ట్రెండింగ్ వార్తలు