Reliance New Store : హయత్‌నగర్‌లో రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్ ప్రారంభం..

Reliance Latest Store : రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్‌లో అద్భుతమైన ఎర్లీ బర్డ్ ఆఫర్లతో ప్రముఖ బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

Reliance New Store : హయత్‌నగర్‌లో రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్ ప్రారంభం..

Reliance Digital unveils its latest store

Reliance Latest Store : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్ ప్రారంభించింది. హయత్ నగర్‌లోని బాగత్ విలేజ్ ఆర్టీసీ సూపర్ వైజర్స్ కాలనీ ఎదురుగా ఈ కొత్త స్టోర్ ఏర్పాటు చేసింది. రిలయన్స్ డిజిటల్ హయత్ నగర్ స్టోర్‌ను ప్రముఖ సినీనటి నభా నటేష్ చేతుల మీదుగా ప్రారంభించింది. మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొని ఎక్స్ క్లూజివ్ సైన్ చేసిన సరుకులను అందుకునే అవకాశం కూడా లభించింది.

Read Also : Reliance Jio Plans : జియో యూజర్లకు పండగే.. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. మరెన్నో బెనిఫిట్స్ కూడా!

గ్రౌండ్ వన్ అదనపు అంతస్తుతో 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది. ఈ స్టోర్ సరసమైన ధరలలో విస్తృత శ్రేణి లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ అందిస్తుంది. ఇన్-స్టోర్ హెల్ఫ్ కోసం నిపుణులైన టెక్ స్క్వాడ్, ఎలక్ట్రానిక్స్ రెస్క్యూ సర్వీస్ నిపుణులను కూడా అందిస్తుంది.

వేగవంతమైన డెలివరీతో పాటు ఇన్‌స్టాలేషన్‌తో వినియోగదారులు ఇప్పుడు ఎలాంటి ఆలస్యం లేకుండా తమకు ఇష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్‌లో అద్భుతమైన ఎర్లీ బర్డ్ ఆఫర్లతో ప్రముఖ బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

రిలయన్స్ డిజిటల్ 500కు పైగా అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లకు చెందిన 2వేలకు పైగా ఉత్పత్తులను అందిస్తోంది. ఇందులో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, హోమ్ థియేటర్లు, డిజిటల్ కెమెరాలు, ల్యాప్‌టాప్స్, యాక్సెసరీస్ ఇతర చిన్న ఎలక్ట్రానిక్స్ వస్తువులతో సహా వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ కూడా ఉన్నాయి.

“పర్సనలైజింగ్ టెక్నాలజీ”కు అనుగుణంగా రిలయన్స్ డిజిటల్ వినియోగదారులకు సరసమైన ధరలలో ఉత్పత్తులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈజీ ఈఎమ్ఐతో సహా మల్టీ ఫైనాన్స్ ఆప్షన్లతో ఎలక్ట్రానిక్ పరికరాలపై తిరుగులేని డీల్స్ అందించడం ద్వారా రిలయన్స్ డిజిటల్ ప్రతి కస్టమర్ జీవనశైలికి తగిన కచ్చితమైన సాంకేతికతను కనుగొనడంలో సాయపడటమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : JioAirFiber Plans : జియో యూజర్లకు అదిరే ఆఫర్.. ఎయిర్‌ఫైబర్ ప్లాన్లపై 30శాతం డిస్కౌంట్.. ఎప్పటివరకంటే?