Vivo Y37 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో Y37 ప్రో ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Vivo Y37 Pro Launch : ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్‌తో 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

Vivo Y37 Pro With Snapdragon 4 Gen 2 SoC, 6,000mAh Battery

Vivo Y37 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్‌తో 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంది.

Read Also : Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్‌ ఎప్పుడో తెలిసిందోచ్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు మీకోసం..!

ఈ ఫోన్ 6.68-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 1,000నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయిని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ షాక్-అబ్సోర్బెంట్ బిల్డ్, దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉండనుంది.

వివో వై37 ప్రో ధర ఎంతంటే? :
చైనాలో వివో వై37ప్రో 8జీబీ+256జీబీ ఆప్షన్ ఎంపిక ధర సీఎన్‌వై 1,799 (దాదాపు రూ. 21,300)గా నిర్ణయించింది. ఈ వివో ఫోన్ ఆప్రికాట్ సీ, కాసిల్ ఇన్ ది స్కై, డార్క్ నైట్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది.

వివో వై37ప్రో స్పెసిఫికేషన్, ఫీచర్లు :
వివో వై37 ప్రో 6.68-అంగుళాల హెచ్‌డీ+ (720 x 1,600 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌తో గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయిని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అడ్రినో 613 జీపీయూ, 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ద్వారా ఫవర్ పొందుతుంది. ఈ ఫోన్ ర్యామ్ వర్చువల్‌గా 8జీబీ వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4తో ఫోన్ షిప్పింగ్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో వై37ప్రో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ సెన్సార్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ యూనిట్ కూడా ఉంది.

వివో 44డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వివో వై37 ప్రోలో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ వివో ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది.

Read Also : Vivo T3 Ultra Launch : కొత్త వివో టీ3 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు, ధర వివరాలు లీక్!

ట్రెండింగ్ వార్తలు