ESIC Job vacancies : భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన లూథియానాలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 67 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఖాళీల వివరాలకు సంబంధించి అనస్థీషియా 7, క్యాజువాలిటీ 1, ఈఎన్ టి 1, జనరల్ మెడిసిన్ 5, జనరల్ సర్జరీ 7, ఐసీయు 7, గైనకాలజీ 7, ఆర్థోపెడిక్స్7, పీడియాట్రిక్స్ 6, పాథాలజీ 2, యూరాలజీ 2, పల్మ్ మెడిసిన్ 2, నియోనాటాలజీ1, మనోరోగచికిత్స 1, రేడియాలజీ 2, నెఫ్రాలజీ 1, ప్లాస్టిక్ సర్జరీ 1, బయోకెమిస్ట్రీ 1, మైక్రోబయాలజీ 1, గ్యాస్ట్రోఎంటరాలజీ 1, ఎండోక్రినాలజీ 1,న్యూరాలజీ 1, హోమియోపతి 1, ఆయుర్వేదం 1 ఖాళీ ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్‌ల్ డిగ్రీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 35 నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు సంబంధిత డాక్యుమెంట్లతో సెప్టెంబర్ 21, 2022వ తేదీ ఉదయం 9 గంటల 30 నిముషాలకు ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.esic.nic.in/ పరిశీలించగలరు.