Site icon 10TV Telugu

NIN ADMISSIONS : నిన్ లో ప్రవేశాలకు ఎన్ సెట్ 2022

Nin Set

Nin Set

NIN ADMISSIONS : హైదరాబాద్ లోని జాతీయ పోషకాహార సంస్ధ లో ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఎన్ సెట్ 2022 నిర్వహిస్తోంది. నిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వాహణకు గాను ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ 22 సీట్లు, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ 17 సీట్లు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంబీబీఎస్ బీఏఎంఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

కోర్సు వ్యవధి రెండేళ్ల కాలం ఉంటుంది. ప్రవేశ పరీక్ష, కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది జూన్ 30, 2022గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష జులై 16, 2022న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://www.nin.res.in పరిశీలించగలరు.

Exit mobile version