GHMC అధికారులు స్థానిక పోలీసులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. Hyderabad వ్యాప్తంగా రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిటీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి.
వర్షం తగ్గే వరకూ పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వర్షం నీరు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లడంతో టోలీచౌకీ లాంటి ఏరియాల్లో ఉండే వారిని ఎగువ ప్రాంతాలకు చేరుస్తున్నారు.
GHMC డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బోట్ల సాయంతో కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు లేదా వారి బంధువుల ఇళ్లకు చేరుస్తున్నారు. నదీమ్ కాలనీలోని షా హతీమ్ తలాబ్ ప్రాంతాల వారి ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి.
భారీ వర్షాల ప్రభావం కారణంగా GHMC నగరంలో సిటిజన్లకు సూచనలిచ్చింది. ఎమర్జెన్సీ అయితే తప్పించి బయటకు రావొద్దని సూచించింది.