Site icon 10TV Telugu

Bryan Johnson : రూ.వందల కోట్లకు అధిపతి, అయినా పెళ్లి కావటంలేదు..

US  billionaire Bryan Johnson

US  billionaire Bryan Johnson

US  billionaire Bryan Johnson : అతనో బిలియనీర్. పేరు బ్రియాన్ జాన్సన్(Bryan Johnson). అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ అందంగాడు వందల రూ.కోట్లకు అధిపతి. వయస్సు పెరగకుండా ఉండేందుకు మద్యం తాగే అలవాటు కూడా మానేశాడు. వయస్సు 45 ఏళ్లు అయినా కుర్రాడిలా కనిపిస్తాడు. కండలు తిరిగిన బాడీతో అమ్మాయిల్ని ఆకర్షించే రూపంతో గ్రీకువీరుడిలా ఉంటాడు. అయినా పెళ్లి కావటంలేదు. పెళ్లి కోసం ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు పారిపోతున్నారట..దీంతో బ్రియాన్ పెళ్లికాని శ్రీమంతుడిలా మిగిపోయాడు. కానీ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ అమ్మాయిలు మాత్రం అతగాడిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటంలేదు.

అందం ఉంది..అపారమైన సంపద ఉంది. చక్కటి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. మద్యం తాగడు..అయినా పెళ్లి కావటంలేదు. కారణం ఏంటీ..ఎక్కడ బెడిసికొడుతోంది..? అంటే పెళ్లి చేసుకునే అమ్మాయికి అతగాడు పెట్టే కండిషన్లే కారణమట..45 ఏళ్ల బ్రియాన్ జాన్సన్ కుర్రవాడిలా కనిపించటానికి యవ్వనం కోల్పోకుండా నవ యువకుడిలా ఉండేందుకు ఏడాదిగా రూ.16 కోట్ల ఖర్చు చేస్తాడు. దాని కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. నిపుణులు సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. దాని కోసం ఏకంగా ఓ టీమ్ నే పెట్టుకున్నాడు. నవయవ్వనం కోసం మద్యం కూడా మానేశాడు. ఇలాంటి వ్యక్తికి భాగస్వామి దొరక్కపోవడం ఆశ్చర్యమే..

cockroach Fry : బొద్దింకల ఫ్రై .. ఎర్రమిర్చితో నంచుకుని లాగించేస్తున్న యువతి

తనకు భార్యగా ఉండాలంటే కొన్ని కండిషన్స్ పెడతాడు బ్రియాన్ జాన్సన్.10 షరతులతో కూడిన లిస్టు చూపిస్తాడు. వాటిని తప్పకుండా పాటించాలంట. ఆ రూల్స్ చూసిన అమ్మాయిలు అట్నుంచి అటే పోతారు. నీతో పెళ్లీ వద్దు నీ రూల్స్ వద్దురా బాబూ అంటు వచ్చినదారినే పోతారట. ఇలా పెళ్లి చేసుకునే అమ్మాయిల్ని రూల్స్ తో బెదరగొట్టేసే తంతు కొన్నేళ్లుగా జరుగుతోంది.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో తన అనుభావాలను షేర్ చేశాడు బ్రియాన్‌. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నానని..లైఫ్ పార్ట్ నర్ దొరటం కష్టంగా ఉందని చెబుతున్నాడు. ‘‘డేటింగుకు వెళదామనుకొన్నపుడు..ఓకే అంటారు. తీరా తాను ఆ లిస్ట్ చూపిస్తే చాలు నో ఇంట్రస్ట్ అనేస్తున్నారట. అందుకే నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకు రావటంలేదు అంటూ వాపోయాడు. నాకు ముడుచుకొని పడుకోవడం అలవాటు.మరి లైఫ్ పార్టనర్ తో ఉన్నప్పుడు అలా ఉండలేం కదా. రోజుకు 111 మాత్రలు వేసుకుంటా’’ అని బ్రియాన్‌ జాన్సన్‌ వివరించాడు.అలా అపారమైన సంపద ఉన్నా..అతని అసాధారణ జీవనశైలి కారణంగా శృంగార సంబంధాలను ఏర్పరచుకోవడం కష్టంగా ఉందట.

 

Exit mobile version