Car bomb Blast in Afghanistan: ఆఫ్ఘ‌న్‌ బాంబు పేలుడు.. 30కి చేరిన మృతులు!

దేశంలో కరోనా మహమ్మారి విరుచుపడుతూ దేశాలకు దేశాలే అస్తవ్యస్తమవుతున్నా ఆఫ్ఘన్ లో నరమేధం మాత్రం ఆగలేదు. ఆఫ్ఘనిస్తాన్ తూర్పు లోగర్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి భారీ కారు బాంబు పేలుడు జరిగింది. ఇందులో ఇరవైమందికి పైగా అక్కడిక్కడే మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.

Car bomb Blast in Afghanistan: దేశంలో కరోనా మహమ్మారి విరుచుపడుతూ దేశాలకు దేశాలే అస్తవ్యస్తమవుతున్నా ఆఫ్ఘన్ లో నరమేధం మాత్రం ఆగలేదు. ఆఫ్ఘనిస్తాన్ తూర్పు లోగర్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి భారీ కారు బాంబు పేలుడు జరిగింది. ఇందులో ఇరవైమందికి పైగా అక్కడిక్కడే మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు. వీరిలో మరికొందరు మృత్యువాత పడడంతో శుక్రవారానికి మృతుల సంఖ్య 30కి చేరింది. చ‌నిపోయిన వారిలో ఎక్కువ‌గా హైస్కూల్ విద్యార్థులు ఉన్న‌ట్లు స‌మాచారం.

రంజాన్ సందర్భంగా కొందరు అతిథులు ఉపవాసం విరమించుకోవడానికి లోగ‌ర్ ప్రావిన్స్‌లోని ఓ ఇల్లును గెస్ట్‌హౌస్‌గా వాడుతుంటారు. అలానే శుక్ర‌వారం రాత్రి ప్రార్థ‌న‌ల అనంత‌రం ఉప‌వాసం విడిచిన వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో గెస్ట్ హౌస్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుపై నిలిపివుంచిన కారు నుండి ఒక్క‌సారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గెస్ట్‌హౌస్‌ కుప్ప‌కూలిపోగా దాదాపు 22 మంది అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మరో 60 మంది పైనే గాయ‌ప‌డిన‌ట్లు అక్కడి మీడియా పేర్కొంది.

పోలీసులు, భద్రతా దళాలు, సహాయక బృందాలు హుటాహుటిన పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించగా వారిలో చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మ‌రింత ఇంకా పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంత‌ర్గ‌త మంత్రి తెలిపగా.. పేలుడు వెనుక ఎవరున్నారో ఇంకా స్పష్టంగా తెలియలేదని.. తాలిబన్ల నుండి ఎలాంటి స్పందన లేదని తెలిపారు. పేలుళ్లపై అత్యున్నత విచారణకు ఆదేశించామని త్వరలోనే కారణాలు చెప్తామన్నారు.

Read: Irwin Mango: ఒక్కో మామిడి పండు రూ.13 వేలు.. ఇవి ఇంత ధర ఎందుకో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు