Daryl Mitchell : డారిల్ మిచెల్ ఎంత పని చేసావయ్యా.. వాళ్ల అమ్మ గనుక చూస్తే వీపు విమానం మోతె..!
మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- May 7, 2024 / 05:39 PM IST
Daryl Mitchell Breaks Fan iPhone During Practice Session
CSK player Daryl Mitchell : ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన సీఎస్కే ఆరు మ్యాచుల్లో విజయాలు సాధించింది. 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా.. గత ఆదివారం (మే 5న) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఆరంభానికి రెండు గంటల ముందే కొందరు అభిమానులు మైదానంలోకి వచ్చారు. తమ అభిమాన ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తుండగా ఆ దృశ్యాలను వారు మొబైల్ ఫోన్లలో బంధిస్తున్నారు. కాగా.. మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్న సీఎస్కే ఆటగాడు డారిల్ మిచెల్.. ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడు కొట్టిన ఓ బంతి మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ఫ్యాన్ మొబైల్‌ను బలంగా తాకింది.
Golden Duck : ఐపీఎల్లో గోల్డెన్ డక్ అంటే ఏమిటి? ఎన్ని రకాల డకౌట్లు ఉన్నాయో తెలుసా..?
దీంతో ఫోన్ డ్యామేజ్ అయ్యింది. దీన్ని తెలుసుకున్న డారిల్ మిచెల్ సదరు అభిమానికి క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా తన చేతికి ఉన్న గ్లోవ్స్‌ను అతడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. కాగా.. తన ఖరీదైన ఫోన్ పగిలిపోయిందన్న బాధ కంటే మిచెల్ గ్లోవ్స్ దొరికాయన్న ఆనందంలో సదరు అభిమాని పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. గ్లోవ్స్‌కు బదులు మొబైల్ కొనిస్తే బాగుండేదని ఓ అభిమాని అనగా.. ఈ వీడియో గనుక సదరు అభిమాని తల్లి చూస్తే అతడి వీపు విమానం మోత మోగడం ఖాయమని ఇంకొకరు కామెంట్ చేశారు.
RCB : ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జరగాల్సిందే
ఇదిలా ఉంటే.. గ్రూపు స్టేజీలో చెన్నై మరో మూడు మ్యాచులను ఆడాల్సి ఉంది. మే 10న గుజరాత్ టైటాన్స్, మే 12న రాజస్థాన్ రాయల్స్, మే 18న రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
