Golden Duck : ఐపీఎల్‌లో గోల్డెన్ డ‌క్ అంటే ఏమిటి? ఎన్ని ర‌కాల డ‌కౌట్లు ఉన్నాయో తెలుసా..?

గోల్డెన్ డ‌కౌట్ అంటే ఏమిటి? ఇంకా ఎన్ని ర‌కాల డ‌కౌట్లు ఉన్నాయో ఓ సారి చూద్దాం..

Golden Duck : ఐపీఎల్‌లో గోల్డెన్ డ‌క్ అంటే ఏమిటి? ఎన్ని ర‌కాల డ‌కౌట్లు ఉన్నాయో తెలుసా..?

What is Golden Duck in Cricket Types of Ducks explained

Golden Duck in Cricket : ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఆదివారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 28 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోని ప‌రుగులు ఏమి చేయ‌కుండానే ఔట్ అయ్యాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ కావ‌డంతో ధోని గోల్డెన్ డ‌క్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఈ క్ర‌మంలో నెటింట్ట చాలా మంది గోల్డెన్ డ‌క్ అంటే ఏమిటి? అన్న దానిపై తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా.. అస‌లు గోల్డెన్ డ‌కౌట్ అంటే ఏమిటి? ఇంకా ఎన్ని ర‌కాల డ‌కౌట్లు ఉన్నాయో ఓ సారి చూద్దాం..

గోల్డెన్ డ‌కౌట్‌..
క్రికెట్ లో సాధార‌ణంగా ఓ బ్యాట‌ర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ప‌రుగులు ఏమి చేయ‌కుండా ఔట్ అయితే దాన్ని గోల్డెన్ డ‌కౌట్‌గా ప‌రిగ‌ణిస్తారు.

Hardik Pandya : ముంబై ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌పై హార్దిక్ పాండ్య‌.. ఆ లెక్క‌లు నాకు తెలియ‌వు భ‌య్యా..

సిల్వ‌ర్ డ‌క్‌..
ఓ బ్యాట‌ర్ తాను ఎదుర్కొన్న రెండో బంతికి ప‌రుగులు ఏమి చేయ‌కుండా ఔట్ అయితే దాన్ని సిల్వ‌ర్ డ‌క్ అంటారు.

బ్రాంచ్ డ‌కౌట్‌..
ఓ బ్యాట‌ర్ తాను ఎదుర్కొన్న మూడో బంతికి ప‌రుగులు ఏమి చేయ‌కుండా ఔట్ అయితే దాన్ని సిల్వ‌ర్ డ‌క్ అంటారు.

డైమండ్ డ‌కౌట్‌..
క్రికెట్ చాలా అరుదైన సంద‌ర్భాల్లో మాత్ర‌మే డైమండ్ డ‌కౌట్ల‌ను చూస్తుంటాం. ఓ బ్యాట‌ర్ ప‌రుగులు ఏమి చేయ‌కుండా ఒక్క బంతిని కూడా ఎదుర్కొన‌కుండా ఔటైతే దాన్ని డైమండ్ డ‌కౌట్ అంటారు. ఇలాంటి సంద‌ర్భాల్లో బ్యాట‌ర్లు ర‌నౌట్లు అవుతుంటారు.

RCB : ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జ‌ర‌గాల్సిందే

ఇక ఐపీఎల్ ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక సార్లు గుజ‌రాత్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. అత‌డు 11 సార్లు గోల్డెన్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా మాక్స్‌వెల్‌, దినేశ్ కార్తీక్ త‌దిత‌రులు ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు గోల్డెన్ డ‌కౌట్లు అయిన ఆట‌గాళ్లు వీరే..

ర‌షీద్ ఖాన్ – 11 సార్లు
గ్లెన్ మాక్స్‌వెల్ – 9 సార్లు
దినేశ్ కార్తీక్ – 7
హ‌ర్భ‌జ‌న్ సింగ్ – 7
సునీల్ న‌రైన్ – 7
విరాట్ కోహ్లి – 7