Hardik Pandya : ముంబై ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌పై హార్దిక్ పాండ్య‌.. ఆ లెక్క‌లు నాకు తెలియ‌వు భ‌య్యా..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ప్ర‌ద‌ర్శ‌న అంతంత మాత్రంగానే ఉంది

Hardik Pandya : ముంబై ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌పై హార్దిక్ పాండ్య‌.. ఆ లెక్క‌లు నాకు తెలియ‌వు భ‌య్యా..

Hardik Pandya Blunt Playoffs Reply To Sanjay Manjreka

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ప్ర‌ద‌ర్శ‌న అంతంత మాత్రంగానే ఉంది. ఆ జ‌ట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించింది. కేవ‌లం సాంకేతికంగా మాత్ర‌మే రేసులో ఉంది. వాంఖ‌డే వేదిక‌గా సోమ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లు తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుంది. అట్ట‌డుగు నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో రాణించి మూడు వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు. కాగా.. మ్యాచ్ అనంత‌రం టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ ముంబై ఇండియ‌న్స్ ప్లే ఆఫ్స్ అవ‌కాశాల గురించి కెప్టెన్ హార్దిక్ పాండ్య‌ను ప్ర‌శ్నించాడు. దీనిపై ఎలాంటి స‌మీక‌ర‌ణాలు త‌న‌కు తెలియ‌వ‌ని హార్దిక్ చెప్పాడు. మిగిలిన మ్యాచుల్లో నాణ్య‌మైన క్రికెట్ ఆడ‌డంపై మాత్ర‌మే త‌మ ఫోక‌స్ ఉంద‌న్నాడు.

MS Dhoni : చెన్నై కోసం ధోని చేస్తున్న త్యాగం.. ఎవ్వ‌రికి తెలియ‌దా?

స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో బ్యాట‌ర్లు అద్భుతంగా ఆడార‌న్నాడు. బౌలింగ్‌లో అద‌నంగా 10 నుంచి 15 ప‌రుగులు అద‌నంగా స‌మ‌ర్పించుకున్న‌ట్లు చెప్పాడు. త‌న విష‌యానికి వ‌స్తే.. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా బౌలింగ్ చేశాన‌ని, స‌రైన ప్ర‌దేశాల్లో బంతులు వేశాన‌న్నాడు. ఇక సూర్య ఆట న‌మ్మ‌శ‌క్యంగా లేద‌న్నాడు.

బౌల‌ర్ ఎవరైనా స‌రే వారిపై సూర్య ఒత్తిడి తీసుకురాగ‌ల‌డ‌ని చెప్పాడు. ఎంతో ఆత్మ‌విశ్వాసంతో బ్యాటింగ్ చేశాడ‌ని, సూర్య ఇన్నింగ్స్ కార‌ణంగా మ్యాచ్ స్వ‌రూపం మారిపోయింద‌న్నాడు. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ బ్యాట‌ర్ల సూర్య ఒక‌డ‌ని హార్దిక్ కితాబు ఇచ్చాడు. సూర్య లాంటి ఆట‌గాడు త‌మ జ‌ట్టులో ఉండ‌డం అదృష్టం అని హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు.

IPL 2024 : డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ క‌న్నీళ్లు..! మైదానంలో హార్దిక్ పాండ్య న‌వ్వులే న‌వ్వులు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. స‌న్‌రైజ‌ర్స్ మొద‌ట‌ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (48; 30 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్‌), కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్‌; 17 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స‌ర్లు) లు రాణించారు. కాగా.. ల‌క్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్‌; 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అజేయ సెంచ‌రీతో చెలరేగాడు.