Karkataka Rasi Phalalu 2026 : ఈ ఏడాది కర్కాటక రాశి వారు కఠినంగా లేకపోతే.. నిండా ముంచేస్తారు జాగ్రత్త..!
Karkataka Rasi Phalalu 2026 : కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పెద్దగా కలిసి రాదంటున్నారు పండితులు.
Parabhava nama samvatsara ugadi panchangam 2026 karkataka rasi phalalu Cancer horoscope
Karkataka Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పెద్దగా కలిసి రాదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఆదాయం ఎంత వచ్చినా అంతా ఖర్చవుతుందని.. అవమానాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఇతరుల విషయాల్లో తల దూర్చకుండా మీ పని మీరు చేసుకుని వెళ్లడం ఉత్తమం అని, సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. ఎవరి నుంచి ఏం ఆశించొద్దని సూచిస్తున్నారు. ఖర్చు చేసే డబ్బును వివాహాది శుభకార్యాల కోసం వినియోగిస్తే మంచిదంటున్నారు. అలానే కర్కాటక రాశి వారు అక్టోబర్ 31 వరకు కొత్త పెట్టుబడులు పెట్టకూడదని సూచిస్తున్నారు.
ఆదాయం: 8 వ్యయం: 5 రాజపూజ్యం: 2 అవమానం: 4
అదృష్ట సమయం (నవంబర్ – జనవరి): అక్టోబర్ 31 తర్వాత గురువు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో విదేశీ ప్రయత్నాలు, కొత్త వ్యాపారాలు లేదా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. ఈ మూడు నెలలు కర్కాటక రాశి వారికి ఎంతో కలిసి వచ్చే సమయం అంటున్నారు.
ముఖ్యమైన తేదీ: కర్కాటక రాశి వారు ‘ధనత్రయోదశి’ నాడు శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకుంటే మంచిదంటున్నారు. వ్యాపారాల్లో లేదా షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
పరిహారాలు:
- కర్కాటక రాశి మానసిక ప్రశాంతత కోసం కృష్ణ మౌక్తిక మాల (నల్ల ముత్యాల మాల) ధరిస్తే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు.
- దేవీ నవరాత్రులలో అమ్మవారి దీక్ష, భవాని దీక్ష తీసుకోవడం వల్ల దురదృష్టం తొలగిపోతుందంటున్నారు
ఆలయ దర్శనం:
- జమ్మూలోని వైష్ణోదేవీ మాతను దర్శించుకోవాలి.
- ఒకవేళ వీలుకాకపోతే, కంచి కామాక్షి అమ్మవారిని దర్శించి, తెలుపు రంగు పట్టుచీర (కుంకుమ, ఆరెంజ్ కలర్ అంచు ఉన్నది) సమర్పించాలి. అక్కడ పీఠాధిపతులను కూడా దర్శించుకోవడం మంచిదంటున్నారు
- పేద విద్యార్థులకు వస్త్రదానం, పుస్తక దానం చేయాలి.
- శని, రాహు ప్రభావం తగ్గడానికి శివారాధన చేయాలి. స్పటిక లింగానికి ప్రతిరోజూ పూజ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.
