Gold Rate Today : పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్.. బంగారం, వెండి ధరల్లో ఇవాళ భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. ఇవాళ్టి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కిందటి రోజుతో పోలిస్తే బంగారం ధర మళ్లీ పెరిగింది.

ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధవాతావరణం కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గినా.. బంగారం, వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.490 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 450 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 12డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,751 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శుక్రవారం కిలో వెండిపై రూ.5వేలు పెరగ్గా.. ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840కాగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,990కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,840కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,40,100 వద్ద కొనసాగుతుంది.

వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
