Ustaad Bhagat Singh OTT : పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ లోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు ఎక్కడ?
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటీ లోకి రానుంది. (Ustaad Bhagat Singh)
Ustaad Bhagat Singh OTT Netflix
Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇటీవల మార్చ్ 19న ఉగాది సందర్భంగా థియేటర్స్ లో రిలీజయి పర్వాలేదనిపించింది, యావరేజ్ టాక్ తోనే ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి మరోసారి పవర్ స్టార్ స్టామినా నిరూపించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మాణంలో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఫస్ట్ హాఫ్ సింపుల్ గా సాగినా సెకండ్ హాఫ్ మంచి లవ్ స్టోరీతో, తొలిప్రేమ ఈ మనసే రీమిక్స్ సాంగ్ తో, ట్విస్టులతో, ఎలివేషన్ సీన్స్ తో అదిరిపోయింది. ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా బాగా నచ్చింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటీ లోకి రానుంది.
Also Read : స్టాండప్ కామెడీ పేరుతో పవన్, నిహారిక విడాకులపై వెకిలి వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్, నెటిజన్లు..
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మరోసారి ఓటీటీలో చూడటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 16 నుంచి చూసేయండి..
థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడే సినిమాలోని కొన్ని డైలాగ్స్, పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ సీన్స్, ఈ మనసే సాంగ్ బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. ఇక ఓటీటీలోకి వస్తే మరోసారి సోషల్ మీడియాలో ఈ సినిమా సీన్స్, ఈ మనసే.. సాంగ్, పవన్ ఎలివేషన్ సీన్స్ వైరల్ అవ్వాల్సిందే.
View this post on Instagram
Also Read : సింగర్ మంగ్లీ, దర్శకుడు వేణు ఉడుగులపై కేసు నమోదు.. చంపేస్తామని బెదిరించారంటూ..
