MS Dhoni : చెన్నై కోసం ధోని చేస్తున్న త్యాగం.. ఎవ్వరికి తెలియదా?
కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ దిశగా దూసుకువెలుతోంది.

MS Dhoni is playing down the order in IPL 2024 because of leg tear
MS Dhoni – Chennai Super Kings : కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ దిశగా దూసుకువెలుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడగా ఆరు మ్యాచుల్లో విజయాలు సాధించింది. 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించినప్పటికి ఆ జట్టు మాజీ ఆటగాడు ధోని పై విమర్శలు వెలువెత్తాయి.
ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే జట్టు 16వ ఓవర్‌లో 122 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో ధోని బ్యాటింగ్‌కు వస్తాడని అంతా భావించారు. అయితే.. ఆశ్చర్యకరంగా శార్దూల్ ఠాకూర్ గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. దీంతో అభిమానులు నిరాశకు గురి అయ్యారు. కావాలనే బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోని వెనక్కు వెలుతున్నాడు అంటూ విమర్శలు వచ్చాయి. తొమ్మిదో స్థానంలో ధోని బ్యాటింగ్‌కు రావడం కంటే అతడు జట్టు నుంచి తప్పుకుని ఓ ఫాస్ట్ బౌలర్‌ను ఆడిస్తే సీఎస్‌కే ప్రమోజనం ఉంటుందని మాజీ చెన్నై జట్టు ఆటగాడు హర్భజన్ అన్నాడు.
KKR : కేకేఆర్ ఆటగాళ్లకు తప్పని తిప్పలు.. విమానం రెండు సార్లు దారి మళ్లింపు..
ధోని త్యాగం..
ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని తొడకండరాల గాయంతోనే ఆడుతున్నట్లు సీఎస్‌కే వర్గాలు వెల్లడించినట్లు ఇన్‌సైడర్ స్పోర్ట్స్ తన కథనంలో తెలిపింది. దీంతో ధోని ఎక్కువ సేపు పరిగెత్తే అవకాశం లేదు. అదే సమయంలో సీఎస్‌కే లో రెండో వికెట్ కీపర్ అయిన డెవన్ కాన్వే సైతం గాయపడ్డాడని, అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో ధోనినే బాధను ఓర్చుకుంటూ మైదానంలో బరిలోకి దిగుతున్నాడని తెలిపింది.
డాక్టర్లు ధోనిని విశ్రాంతి తీసుకోవాలని సూచించినా, జట్టులోని కీలక ఆటగాళ్లు గాయపడడంతో ధోని ఆడుతున్నాడని చెప్పింది. బి టీమ్‌తోనే చెన్నై బరిలోకి దిగుతోందని, ధోనిని విమర్శించే వారికి అతడు సీఎస్‌కే జట్టు కోసం చేస్తున్న త్యాగం తెలియకపోవచ్చునని చెన్నై వర్గాలు తెలిపినట్లు పేర్కొంది.
IPL 2024 : డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ కన్నీళ్లు..! మైదానంలో హార్దిక్ పాండ్య నవ్వులే నవ్వులు
సీఎస్‌కే తన తదుపరి మ్యాచ్‌ను మే 10న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
MS Dhoni is playing IPL 2024 with a leg muscle tear that is restricting his movements and he can’t run for too long. MS is taking medicines to minimise his pain and run well.
– SALUTE MS… The commitment just for fans is unbelievable….!!! ??? pic.twitter.com/YJosHUME54
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 7, 2024