Gold Price Today : గోల్డ్ కొనేవారికి పండగే.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలు ఇవే..
Gold Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేటు తగ్గింది.

ఉగాది పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గత నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఈ రెండు విలువైన లోహాల ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడం వినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది.

ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర తగ్గింది. గడిచిన నాలుగు రోజుల్లో తులం గోల్డ్ పై సుమారు రూ.4వేలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 57డాలర్లకుపైగా తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఔన్స్ గోల్డ్ 5,022 డాలర్ల వద్ద కొనసాగుతుంది.

ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధర కూడా తగ్గింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ. 20వేలకుపైగా తగ్గుదల చోటు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,660కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,46,350 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,810 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,500 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,660కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,46,350 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,59,660 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,46,350 వద్దకు చేరింది.

వెండి ధరలో ఇవాళ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్దకు పడిపోయింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
