‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ బోల్డ్ సాంగ్ చూశారా..?
ధ్రువ్ సర్జా హీరోగా కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మాణంలో ప్రేమ్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కేడీ : ది డెవిల్’. సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా నానయ్య.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్..' అంటూ సాగే బోల్డ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. అర్జున్ జన్య సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రాయగా మంగ్లీ పాడారు. నోరా ఫతేహీ, సంజయ్ దత్ లపై ఈ సాంగ్ ని చిత్రీకరించారు.
