డిసెంబర్ 31 నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి

డిసెంబర్ 31 రాత్రి ఒంటిగంట తర్వాత నగరంలో ఎక్కడా న్యూఇయర్ వేడుకలు జరపరాదని పోలీసుకమీషనర్ అంజనీ కుమార్ ఆదేశించారు. న్యూఇయర్ వేడుకలు జరిపే ప్రతి చోటా సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని, న్యూ ఇయర్ వేడుకల నిర్వహణపై అన్ని హోటల్స్ ,పబ్స్ యజమానులకు నియమ నిబంధనలు తెలుపుతూ ఆదేశాలు జారీచేశామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా,మైనర్లకు మద్యం అమ్మినా, అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
డిసెంబర్ 31 రాత్రి నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు బంద్ చేస్తామని, .ప్రతి ఏడాది లాగానే పోలీసులు అందరూ రోడ్లపైనే ఉంటారని ఆయన తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం నాలుగు రోజులపాటు హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం అయిందని సీపీ చెప్పారు. సీఎస్ ఆదేశాల మేరకు రాష్టప్రతికి భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరు ఆనందంగా జరుపుకోవాలని,అంజనీకుమార్ నగర ప్రజలకు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.