Tanya Mittal : ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి 150 మంది బాడీ గార్డులా? 800 మంది పనోళ్లా? ఎవరామె?

బాలీవుడ్ బిగ్ బాస్ 19 సీజన్లోకి సోషల్ మీడియా ఫేమ్, బిజినెస్ వుమెన్ తాన్యా మిట్టల్ ఎంట్రీ ఇచ్చింది.(Tanya Mittal)

Tanya Mittal : ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి 150 మంది బాడీ గార్డులా? 800 మంది పనోళ్లా? ఎవరామె?

Tanya Mittal

Updated On : September 9, 2025 / 8:41 PM IST

Tanya Mittal : సాధారణంగా బిగ్ బాస్ లోకి సెలబ్రిటీలే వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ కష్టాలు, సుఖాలు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ గురించి అంతా చెప్పుకుంటారు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా బిగ్ బాస్ జరుగుతుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ 19వ సీజన్ జరుగుతుంది. ఈ సీజన్లోకి సోషల్ మీడియా ఫేమ్, బిజినెస్ వుమెన్ తాన్యా మిట్టల్ ఎంట్రీ ఇచ్చింది. తాన్యా ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి తన పనులతో, తన కామెంట్స్ తో రోజూ వైరల్ అవుతుంది.(Tanya Mittal)

తాన్యా మిట్టల్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడమే 800 చీరలతో, ఒక సూట్ కేసు నిండా నగలతో వచ్చింది. దీంతో అప్పట్నుంచి వైరల్ అవుతుంది. అయితే తాన్యా మిట్టల్ కి 150 మంది బాడీ గార్డ్స్ ఉన్నారంట తన ఇంటి దగ్గర, తన ఇంట్లో 800 మంది పనివాళ్ళు ఉన్నారట. తన బాడీ గార్డ్స్ మహా కుంభమేళాలో పలువురిని కాపాడారని చెప్పింది. అలాగే తన ఇంట్లో ఒక ఫ్లోర్ మొత్తం కేవలం తన చీరలు, డ్రెస్ లే ఉంటాయని తెలిపింది. తను చెప్పిన విషయాలు, తను సోషల్ మీడియాలో చూపించే వీడియోలు వైరల్ గా మారాయి.

Also See : Sharwanand : శర్వానంద్ కొత్త బిజినెస్ లాంచ్.. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా..

తాన్యా మిట్టల్ ఓ మాములు కుటుంబంలో మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో పుట్టింది. తాన్యా తండ్రి కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోలేదని తనే సొంతంగా ఎదిగానని చెప్పింది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన తాన్యా 2018 లో మిస్ ఆసియ టూరిజం యూనివర్స్ గెలుచుకుంది. దాంతో అప్పట్నుంచి మోడల్ గా వర్క్ చేస్తూనే సోషల్ మీడియా లో ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారింది. ఎక్కువగా ఆధ్యాత్మిక వీడియోలతో పాపులర్ అయింది. అలాగే తాన్యా హ్యాండ్ బ్యాగ్స్, శారీస్.. లాంటి బిజినెస్ లోకి ఎంటర్ అయి సక్సెస్ అయింది. సోషల్ మీడియా ద్వారానే తాన్యా నెలకు 6 లక్షలు సంపాదిస్తుందట.

అయితే కొంతమంది వేరే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రం తాన్యా చెప్పేవి అన్ని అబద్దాలు అని, తన ఇల్లు అంత పెద్దది కాదు అని తనని ట్రోల్ చేస్తూ పలు వీడియోలు షేర్ చేస్తున్నారు. పలు రిపోర్ట్ ల ప్రకారం తన మొత్తం ఆస్తి కేవలం 2 కోట్లే ఉంటుందని చెప్తున్నారు. మరి తాన్యా చెప్పేదేమో చాలా గొప్పగా ఉంది. మొత్తానికి తాన్యా చెప్పేది నిజమో కాదో కానీ సోషల్ మీడియాలో మాత్రం తన కామెంట్స్ వైరల్ అవుతుంది. తాన్యాకు సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ 3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

Also Read : Daksha Trailer : మంచు లక్ష్మీ – మోహన్ బాబు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా.. ట్రైలర్ రిలీజ్ చేసిన అల్లు అర్జున్..