Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీతం ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 63,00,00,00,000 కోట్లు
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీతం ప్యాకేజీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదికల ప్రకారం.. రాబోయే మూడు ఏళ్లకు ఆయన జీతం ప్యాకేజీ 692 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,300 కోట్లు)గా అంచనా.. పూర్తి వివరాలివే
Google's Sundar Pichai
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు భారీ శాలరీ ప్యాకేజీ
- రాబోయే 3ఏళ్లలో రూ. 6,361 కోట్లు సంపాదించే ఛాన్స్
- కంపెనీ పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టాక్ యూనిట్లు రెట్టింపు
- పిచాయ్ కోసం 350 మిలియన్ డాలర్ల విలువైన కొత్త స్టాక్ ప్రోత్సాహకాలు
Sundar Pichai : గూగుల్ సీఈఓ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కొత్త ఏఐ లేదా గూగుల్ ప్రొడక్టు గురించి కాదండోయ్.. ఆయన జీతం గురించి.. మూడు ఏళ్లకు ఒకేసారి 692 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,300 కోట్లు) ప్యాకేజీని ప్రకటించింది గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్. ఇదే విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది.
అయితే, ఈ మొత్తం జీతం నెలవారీ జీతం కాదు. ఆయన వర్కింగ్ పర్ఫార్మెన్స్, కంపెనీ డెవలప్ టార్గెట్ సహా అన్నింటితో కలిపి మొత్తం ప్యాకేజీ అనమాట. ఈ ప్యాకేజీలో ఎక్కువ శాతం పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్లలో ఉంది. బిగ్ టెక్ కంపెనీల సీఈఓలు తమ జీతంలో ఎక్కువ భాగాన్ని కంపెనీ షేర్ల రూపంలో పొందుతారు. ఈ స్టాక్ విలువ 126 మిలియన్ డాలర్లు.
ఈ ప్యాకేజీ ఆఫర్ వివరాలివే :
బేసిక్ పే
బోనస్
స్టాక్, షేర్ (RSU)
పనితీరు ప్రొత్సహకాలు
సుందర్ పిచాయ్ ప్యాకేజీని 3 భాగాలుగా విభజిస్తే.. అది ఏడాదికి దాదాపు రూ. 2,100 కోట్లు అవుతుంది. ప్రతి ఏడాదిలో సుమారు 2 మిలియన్లు డాలర్లు (సుమారు రూ. 18 కోట్లు) జీతం అందుకుంటారు.
ప్యాకేజీలో ఎక్కువ భాగం జీతం ఎంతంటే? :
నివేదిక ప్రకారం.. ప్యాకేజీలో ఎక్కువ భాగం 126 మిలియన్ డాలర్ల విలువైన పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ల నుంచి వస్తుంది. వీటిని రెండు భాగాలుగా మార్చారు. ఈ స్టాక్‌లు ఆల్ఫాబెట్ వాటాదారుల రాబడి, S&P 100 ఇండికేషన్పై ఆధారపడి ఉంటాయి. సుందర్ పిచాయ్ తన లక్ష్యాన్ని చేరుకుంటే.. మొత్తం మొత్తం 252 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఒకవేళ ఆయన విఫలమైతే ఫండ్స్ జీరో అయ్యే ప్రమాదం ఉంది.
పిచాయ్ కోసం గూగుల్ 350 మిలియన్ డాలర్ల విలువైన కొత్త స్టాక్ ప్రోత్సాహకాలను ప్రకటించింది. కంపెనీ స్వయంప్రతిపత్తి ప్రాజెక్టుల వృద్ధికి ముడిపడి ఉంది. పిచాయ్ 13 మిలియన్ డాలర్ల విలువైన వేమో స్టాక్, వింగ్‌లో 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను అందుకుంటారు.
2004లో గూగుల్‌లో చేరిన సుందర్ పిచాయ్ :
2004లో 53ఏళ్ల సుందర్ పిచాయ్ గూగుల్‌లో చేరారు. ఆ తర్వాత క్రోమ్ బ్రౌజర్, ఆండ్రాయిడ్ డెవలప్ చేసేందుకు నాయకత్వం వహించారు. ప్రారంభంలో ఏఐ అమలుపై ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఓపెన్ఏఐ 2022లో ChatGPTని ప్రవేశపెట్టింది. అయితే, గూగుల్ తర్వాత అడ్వాన్స్ ఏఐ మోడళ్లను ప్రారంభించింది. ఆ తర్వాత ఇతర గూగుల్ సర్వీసుల్లో చేర్చింది.
