Shukra Shani Conjunction : శని, శుక్రుల యుతి.. ఈ 6 రాశుల వారి జీవితంలో అల్లకల్లోలం.. వ్యసనాలు, వృథా ఖర్చులు, పిల్లల ప్రవర్తనలో జీర్ణించుకోలేని మార్పులు
Shukra Shani Conjunction : మార్చి నెలలో గ్రహాల గమనపరంగా కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారు ఊహించని ఫలితాలు చవి చూడబోతున్నారు.
shukra shani conjunction in pisces results major life and career changes for these zodiac signs
గ్రహాల సంచారం వల్ల జీవితాల్లో మార్పులు జరుగుతాయని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్యులు ఎప్పటికప్పుడు గ్రహాల గమనాన్ని పరిశీలిస్తూ.. దాని వల్ల ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో వివరిస్తుంటారు. కొన్ని సార్లు కొన్ని అరుదైన గ్రహాల కలయిక జరుగుతుంటుంది. మార్చి నెలలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కర్మ ఫల ప్రదాత అయిన శనీశ్వరుడు.. సిరి సంపదలకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడితో యుతి చెందుతున్నారు. ఈ రెండు గ్రహాలు మార్చి 2 నుంచి 26 వరకు మీన రాశిలో యుతి చెందుతున్నాయి. ఈ పరిణామం వల్ల ప్రయోజనాల కన్నా ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు, समस्याలు తలెత్తే అవకాశమే అధికంగా ఉంటుంది అంటున్నారు జ్యోతిష్యులు. మరి ముఖ్యంగా ఈ శుక్ర, శని యుతి వల్ల 6 రాశుల వారి జీవితాల్లో అల్లకల్లోలం చెలరేగుతుందని ప్రకటించారు.
శుక్ర, శని యుతి వల్ల మేషం, సింహం, తులం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారి జీవితాల్లో అసాధారణమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జ్యోతిష్యులు తెలిపారు. ఈ రాశుల వారిలో కొందరు.. కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలు చేసుకుంటారని, విదేశాల్లో ఉద్యోగాలు, సంప్రదాయానికి విరుద్ధమైన నిర్ణయాలు, అసాధారణ వ్యాపారాలు వంటివి జరిగేందుకు అవకాశం ఎక్కువ అంటున్నారు. కొన్ని రాశుల వారిని మిత్రులు పక్కదారి పట్టించే అవకాశం ఉంది అంటున్నారు. కొన్ని రాశుల వారు వ్యసనాలకు అలవాటు పడతారని, వృథా ఖర్చులు అధికంగా చేస్తారని వెల్లడించారు..
మేష రాశి
మార్చి 2 నుంచి మేష రాశి వ్యయ స్థానంలో శుక్ర, శనులు యుతి చెందడం వల్ల.. ఈ రాశుల వారికి కులాంతర ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ఈ రాశి వారి జీవనశైలి, ఆచార సంప్రదాయాలు మారిపోవడం జరుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశాల్లో కొలువు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు తమకు ఏమాత్రం సంబంధం, అనుభవం లేని వ్యాపారాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. అలానే కొందరు ఏదో వ్యసనానికి బానిసవుతారని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపారు.
సింహం
సింహ రాశి వారికి అష్టమంలో శుక్ర, శనుల యుతి వల్ల.. వీరు సంప్రదాయానికి వ్యతిరేకమైన పనులు చేపట్టే అవకాశం పుష్కలంగా ఉందంటున్నారు. ఈ రాశి వారి జీవితంలో కూడా కులాంతర, ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. కొందరు విదేశీయులతో ప్రేమలో పడతారని.. విలాసాలకు అలవాటు పడి.. సరదాలు, వ్యక్తిగత సంతోషాల మీద శ్రద్ధ పెడతారని చెబుతున్నారు. అయితే సుఖప్రదంగా సాగుతున్న ఈ రాశి వారి దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. అపరిచితులతో పరిచయాలు పెరుగుతాయని అంటున్నారు.
తుల
తుల రాశికి అధిపతి మాత్రమే కాక సిరిసంపదలకు కారకుడు అయిన శుక్రుడు.. షష్ట స్థానంలో ఉచ్ఛ స్థాయికి చేరడం వల్ల పాత మిత్రులను వదిలి కొత్త స్నేహితులను చేసుకునే అవకాశం ఉంది. నమ్మకద్రోహులు, శత్రువులతో పరిచయాలు పెంచుకుంటారు. కాకపోతే ఈ రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉందని.. కానీ వృథా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. అనవసర పరిచయాల వల్ల నీతిమంతమైన జీవితానికి వీడ్కోలు పలికి.. అవినీతి మార్గం పట్టేందుకు అవకాశం ఉందంటున్నారు.
వృశ్చికం
వృశ్చిక రాశి పంచమ స్థానంలో శుక్ర, శని యుతి జరగడం వల్ల.. ఈ రాశి వారు కొన్ని సంప్రదాయ విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడతారని.. ముఖ్యంగా కులాంతర వివాహం చేసుకునే అవకాశం అధికంగా ఉంది అంటున్నారు. యువత తమ చదువు, నైపుణ్యాలకు సంబంధం లేని జాబ్లో చేరి ఇబ్బంది పడతారని… పిల్లల్లో క్రమశిక్షణ తగ్గడం, వారి వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఈ రాశి వారి కష్టార్జితంలో అధిక భాగం మోసగాళ్ల పాలవుతుందని.. వీరు ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగులు వేయడం జరుగుతుందని తెలిపారు.
మకరం
మకర రాశివారికి తృతీయ స్థానంలో శని శుక్రుల కలయిక జరగడం వల్ల వృద్ధి యోగం పట్టేందుకు అవకాశం ఉన్నా.. కొన్ని చెడు వార్తలు వినాల్సి వస్తుంది అన్నారు. ఈ రాశి వారి జీవితంలో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతాయని తెలిపారు. ఈ రాశి వారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు లభించడం.. ఇప్పటికే ఇక్కడ పని చేసుకుంటున్న వారికి స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయంటున్నారు. అయితే ఈ రాశి వారు కూడా విదేశీ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకునే అవకాశం అధికంగా ఉందన్నారు. ఈ రాశి వారు.. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
మీనం
మీన రాశి వారికి ఈ రాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడితో శనిగ్రహం కలయిక వల్ల జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అనుకున్నట్లు పనులు జరగకపోవచ్చు, కానీ ఊహించని విధంగా కొన్ని విషయాలు సానుకూలంగా మారే అవకాశమూ ఉంది. కొన్ని వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ఆకస్మికంగా శుభ పరిణామాలు ఎదురవుతాయి. అయితే విలాసాలు, వ్యసనాల పట్ల ఆకర్షణ పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్త అవసరం. అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశమూ ఉంది. జీవనశైలిలో కొంత మార్పు చోటు చేసుకోవచ్చు. ఇప్పటివరకు రాదనుకున్న డబ్బు కూడా చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
