Realme 14 Pro+ : ఇది కదా డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో రియల్‌మి ప్రో ప్లస్ అదుర్స్.. ఏకంగా రూ. 10వేలు తగ్గిందోచ్!
Realme 14 Pro+ : రియల్‌మి 14 ప్రో ప్లస్ బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఈ అద్భుతమైన ఫోన్ మీ బడ్జెట్ ధరలో 6000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో అందుబాటులో ఉంది. రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తోంది.
Realme 14 Pro Plus
- ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను 26శాతం తగ్గింపుతో అందిస్తోంది
- అసలు ధరపై రూ. 9వేలు నేరుగా తగ్గింపు ఆఫర్
- క్రెడిట్ కార్డ్‌తో కొంటే రూ. 1250 వరకు అదనపు డిస్కౌంట్
Realme 14 Pro+ : రియల్‌మి యూజర్లకు గుడ్ న్యూస్.. మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లలో రియల్‌మి 14 ప్రో సిరీస్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ హై-ఎండ్ మోడల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ప్రో ప్లస్ మోడల్‌ను రూ. 10వేలకు పైగా తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌పై కంపెనీ 26శాతం తగ్గింపు అందిస్తోంది. 50MP మెయిన్ కెమెరాతో (Realme 14 Pro+) ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లో భారీ 6000mAh బ్యాటరీ కూడా ఉంది. పూర్తి ఆఫర్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భారత్‌లో రియల్‌మి 14 ప్రో ప్లస్ ధర తగ్గింపు :
రియల్‌మి 14 ప్రో ప్లస్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ సాధారణంగా రూ. 33,999 ధరకు అమ్ముడవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను 26శాతం తగ్గింపుతో అమ్మకానికి పెట్టింది. దాంతో ఈ ఫోన్ ధర రూ. 24,999కి తగ్గింది. అసలు ధర నుంచి రూ. 9వేలు తగ్గింది. అదనంగా, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్‌తో రియల్‌మి 14 ప్రో ప్లస్ తగ్గింపు ధర :
రియల్‌మి 14 ప్రో ప్లస్‌పై కంపెనీ అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్, ఎస్బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 1,250 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. సుమారుగా రూ. 10,250 మొత్తం ధరకు కొనేసుకోవచ్చు.
రియల్‌మి 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 14 ప్రో ప్లస్ 6.83-అంగుళాల 1.5K కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2800×1272 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్ 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 2.5GHz ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్సెట్ అడ్రినో 720 జీపీయూతో వస్తుంది. ఈ ఫోన్ 8GB/12GB LPDDR4X ర్యామ్, 256GB/512GB (UFS 3.1) స్టోరేజ్‌తో వస్తుంది ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి యూఐ 6.0తో రన్ అవుతుంది.
రియల్‌మి 14 ప్రో ప్లస్ బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ ఫోన్లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
