Samsung Galaxy S24 Ultra : వారెవ్వా.. క్రేజీ ఆఫర్ బ్రో.. 200MP కెమెరా, ఈ శాంసంగ్ S24 అల్ట్రా ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే..!
Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 200MP కెమెరాతో మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24 Ultra
- శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపు ధరకే
- ఈ ఫ్లాగ్షిప్ S24 అల్ట్రా 5జీ ప్రస్తుతం రూ. 1,09,990 ధరకు అందుబాటులో
- అసలు ధర రూ. 1,34,999 కాగా, రూ. 25వేలకు పైగా తగ్గింపు
Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, హై-ఎండ్ డిజైన్, అద్భుతమైన స్క్రీన్‌తో మంచి ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీ ఫోన్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (Samsung Galaxy S24 Ultra) రూ. 1,09,990 ధరకు లభిస్తోంది. అసలు ధర రూ. 1,34,999 కాగా, రూ. 25వేలకు పైగా తగ్గింపు పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ఇంకా అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
అలాగే, నెలవారీ ఈఎఐంతో ప్రీమియం ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా మీ పాత స్మార్ట్‌ఫోన్ తయారీ, మోడల్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేయొచ్చు.
200MP కెమెరా ఫీచర్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 200MP ప్రైమరీ సెన్సార్ ద్వారా అదిరిపోయే కెమెరా పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 50MP 5x టెలిఫోటో లెన్స్, 10MP 3x టెలిఫోటో లెన్స్ 12MP అల్ట్రా-వైడ్ కెమెరాతో అన్ని లైటింగ్ పరిస్థితులలోనూ హై రిజల్యూషన్ ప్రొఫెషనల్-గ్రేడ్ ఫొటోలను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీ ఫోన్ అద్భుతమైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌గా రన్ అవుతుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 గెలాక్సీ ప్రాసెసర్‌తో వస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ ఎక్కువసేపు వాడినా ఛార్జింగ్ తగ్గదు.
6.8-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X ఫ్లాట్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. విజువల్ డిస్ప్లే కోసం 2600 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ డిస్ప్లే ప్యానెల్లో గొరిల్లా ఆర్మర్ కోటింగ్ ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఎక్కువ సమయం బ్యాటరీని వేగంగా రీఛార్జ్ చేయొచ్చు. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇంటర్నల్ S పెన్ ఫంక్షనాలిటీ ఉంది. నోట్స్ తీసుకోవడం, డ్రాయింగ్లు గీయడం వంటివి చేయొచ్చు.
ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 వన్ యూఐ 6.1 సిస్టమ్‌పై రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు 7 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ కూడా శాంసంగ్ అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ లాంగ్ టైమ్ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది.
